సస్పెన్షన్ వేటుతో రాపాకకు పవన్ షాక్

114
Rapaka Varaprasad Suspended from Janasena
Rapaka Varaprasad Suspended from Janasena

Rapaka Varaprasad Suspended from Janasena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొరకరాని కొయ్యగా మారిన ఏకైక ఎమ్మెల్యే భారాన్ని దించేసుకోవాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు . పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పదే పదే పవన్ కళ్యాణ్‌ను కించ పరుస్తూ, ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ జగన్ కు జై కొడుతున్న తీరు జనసేన పార్టీ జీర్ణించుకోలేక పోయింది. ఈ నేపధ్యంలో ఆయనను  పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేసింది.

గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. స్వయంగా  అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడంతో..ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే.. కొన్ని రోజులకే ఆయన అధికార పార్టీ పాత పాడటం మొదలు పెట్టారు . తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపిస్తూ అధికార పార్టీకి దగ్గరయ్యారు. తెలుగు మీడియం రద్దు, మూడు రాజధానుల నిర్ణయాలపై..జనసేన స్టాండ్ కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు పలికారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందేనని..స్వయంగా పవన్  లేఖ రాసినా రాపాక పట్టించుకోలేదు. దాంతో ఆయన పదే పదే పార్టీని ధిక్కరించడంతో ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

Rapaka Varaprasad Suspended from Janasena,rapaka varaprasad, rajolu MLA, pawan kalyan , janasena party, three capitals, support, assembly, ys jagan mohan reddy , whip, suspension 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here