సైదాబాద్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పల్లకొండ రాజు వరంగల్ లోని నష్కల్ లో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత గత గురువారం నుంచి పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అతడిని ‘వాంటెడ్’ మనిషిగా ప్రకటించే పోస్టర్లు బస్సులు, ఆటో రిక్షాలు మరియు కల్లుకంపౌండుల్లో అతికించారు.
సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజు సూసైడ్
