రష్మిపై రేప్ అటెంప్ట్ జరిగిందట..

196
Rape Attempt On Rashmi Desai
Rape Attempt On Rashmi Desai

Rape Attempt On Rashmi Desai

మీటూ అంటూ ఎన్ని ఉద్యమాలు వస్తోన్న ఇండస్ట్రీలో ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో జరుగుతోన్న దారుణాలే ఎక్కువ. ఈ మధ్య వీటి విషయంలో తరచూ వార్తలు వస్తోన్న ఆ మైండ్ సెట్ ఉన్న ఇడియట్స్ మాత్రం మారడం లేదు. అందుకే తాజాగా ఓ సినిమా ఆడిషన్ కోసం బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ రష్మీ దేశాయ్ పై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడట.

రష్మి ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఎవరైనా తెలిసిన వారు ఫోన్ నంబర్ అడిగితే ఇచ్చి ఆడిషన్స్ కు వెళుతోందట. ఆ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం సూరజ్ అనేవ్యక్తి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడూ ఫోన్స్ చేస్తుండే అతను రీసెంట్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన యశ్ రాజ్ లో ఓ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని.. ఫలానా అడ్రెస్ కు రావాలని పిలిచాడట,. అది నిజమని వెళ్లింది రష్మి.

తను అక్కడికి వెళ్లేసరికి ఆడిషన్స్ కు సంబంధించిన వాతావరణం ఏం కనిపించలేదట. అదే టైమ్ లో సూరజ్ కూల్ డ్రింక్ తెచ్చి బలవంతంగా తాగించే ప్రయత్నం చేశాడట. ప్రమాదాన్ని పసిగట్టిన రష్మీ దేశాయ్ వెంటనే తేరుకుని ఆ డ్రింక్ తాగకుండా అతన్ని నెట్టివేసి వెళ్లిపోయిందట. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పింది. దీంతో ఆమె తల్లి సూరజ్ ను ఓ రెస్టారెంట్ కు పిలిపించి అందరి ముందూ చెంప చెళ్లుమనిపించిందట. మొత్తంగా రష్మి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లే పెంచింది. కళల ప్రపంచంలో ఎదగాలనే తన కలను నెరవేర్చుకోవాలనుకునే ఇలాంటి ఎందరో అభాగ్యులు అలాంటి మోసగాళ్ల బారిన పడి జీవితాల్నే నాశనం చేసుకుంటున్నారు.

Rape Attempt On Rashmi Desai,Bigg Boss Fame Rashmi Desai,Who Is Rashmi Desai,Suraj,Yashraj Productions,Cinema Auditions,Restrurant,Rashmi Father

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here