ఇది ఇస్మార్ట్ రేప్ అనుకుంటే ఎలా.. బాధ్య‌త లేదా?

93
Puri Gift
Puri Gift

సినిమా అంటే సామాజిక బాధ్య‌త ఉండాలి. స‌రే, ఆ మాట‌ను కాస్త డోస్ త‌గ్గించి చెప్పుకుంటే… కొంచెమైనా సామాజిక బాధ్య‌త ఉండాలి క‌దా! స‌మాజంలో కుళ్లును ప్ర‌శ్నించొచ్చు. వ్య‌వ‌స్థ‌లో లోపాల్ని వ్యంగ్యంగా తెర‌మీదికి తీసుకుని రావొచ్చు. ఎంత ప్రాబ్ల‌మ్ మీద‌నైనా కామెడీ చేసుకోవ‌చ్చు. అది వాళ్ల క్రియేటివిటీ అనుకుందాం! కానీ, కొన్ని సున్నితమైన అంశాలుంటాయి. వాటి జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది. ఒక‌వెళ్లినా కాస్తైనా బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌డం అవ‌స‌రం. ఇస్మార్ట్ శంక‌ర్ లో ఓ రేప్ సీన్ ఉంది. ఇప్పుడు దాని గురించే బ‌య‌ట చ‌ర్చ జ‌రుగుతోంది. కామెడీ పేరుతో ఇంకోదో ఎమోష‌న్ ని రెచ్చ‌గొట్టేలా ఆ సీన్ ఉందంటున్నారు సినిమా చూసిన‌వాళ్ల‌లో కొంద‌రు.

ప్ర‌తీరోజూ దేశంలో ఎక్క‌డో చోట కామాంధుడి కాటుకి ఎవ‌రో అమ్మాయి బ‌లైంద‌నే క‌థ‌నాలు మీడియాలో చూస్తేనే ఉన్నాం. చివ‌రికి, ప‌సి బిడ్డ‌ల్ని కూడా వ‌ద‌ల‌ని రాక్ష‌సుల గురించి వార్త‌లు చ‌దువుతున్నాం. ఇలాంటి టైంలో రేప్ మీద సెటైర్లు వేయ‌డం త‌గునా జ‌గ‌న్నాథుడా..? హీరోయిన్ న‌భా న‌టేష్ ను ఫాలో చేసి, వెంట‌ప‌డి ఆమె రూమ్ లోకి దూరి, ఆమె మీద‌పడి రేప్ చేస్తా రేప్ చేస్తా అంటూ రామ్ రెచ్చిపోతాడు. ఆమె పోలీసుల‌కు ఫోన్ చేసి… న‌న్ను ఖ‌రాబ్ చేయ‌డానికి వ‌చ్చాడంటూ చెప్ప‌డం, వెంట‌నే పోలీసులు బ‌య‌ల్దేరి వ‌చ్చేయ‌డం జ‌రిగిపోతుంది. అయితే, ఈలోగానే న‌భాకి మూడ్ మారిపోతుంది. రామ్ ని తిర‌గేసి… త‌నే పైకెక్కేస్తుంది. ఈలోగా వ‌చ్చిన పోలీసుల్ని చూసి… మా మ‌ధ్య డీల్ సెట్ట‌యిపోయింది, మీరు ఇంటికి వెళ్లొచ్చ‌ని హీరోయిన్ తో చెప్పించాడు ద‌ర్శ‌కుడు పూరి. ఇది కామెడీ కోస‌మే కావొచ్చు. కానీ, మ‌రీ రేప్ సీన్ మీద ఇలాంటి కామెడీ అవ‌స‌ర‌మా, చూడ్డానికే అదోలా ఉంది క‌దా, ద‌ర్శ‌కుడికి ఇదో సున్నిత‌మైన అంశంగానో ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న పెద్ద స‌మ‌స్య‌గానో క‌నిప‌నించ‌లేదా అనేదే ప్ర‌శ్న‌?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here