కోవిడ్ 19 .. ర్యాపిడ్ యాక్షన్ టీమ్

RAPID ACTION TEAMS FOR COVID-19

చైనాలో మొదలైన కరోనావైరస్  చాలా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇరాన్, ఇటలీలలో ఆదివారం ఒక్క రోజే దాదాపు 135 మంది కరోనా దెబ్బకు  మృతిచెందారు. గత 10 నుంచి 12 రోజుల్లోనే వైరస్ 60 దేశాలకు వ్యాపించిందంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత్‌లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 43 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో కేంద్రం పటిష్ఠ చర్యలు ప్రారంభించింది. కోవిద్ 19 వైరస్ చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ ప్రవేశించింది. దీంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని, ఒకవేళ తప్పనిసరైతే తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

తాజాగా, కరోనా కేసులు 43కి చేరుకోవడంతో విదేశాల నుంచి వచ్చే నౌకలను భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.కోవిద్ 19ను కట్టడిచేయాడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సమీక్షించారు. వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరినట్టు వివరించారు. అలాగే విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 8 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలున్న 3,000 మందిని ఐసోలేషన్‌లో ఉంచి, పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. గత మూడు రోజుల్లోనే కరోనా పరీక్షల కోసం కొత్తగా 31 ల్యాబ్‌లను ఏర్పాటుచేశామని, ప్రస్తుతం 56 చోట్ల నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ర్యాపిడ్ యాక్షన్ టీమ్‌లను కూడా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపినట్టు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాపై పోరాటం సాగించాలని పేర్కొన్నారు.

RAPID ACTION TEAMS FOR COVID-19,corona virus , rapid action teams , india, corona virus china , wuhan , covid 19 ,  delhi, isolation wards , leftnent governor

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article