150 ఏళ్ల తర్వాత నేడు అరుదైన చంద్రగ్రహణం

Spread the love

RARE LUNAR ECLIPSE

చంద్రగ్రహణం.. సూర్య గ్రహణాలు వస్తూనే ఉంటాయికానీ ఈ రోజు చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు అర్థరాత్రి తర్వాత స్టార్ అయి.. తెల్లవారుజామున ముగిసే చంద్రగ్రహణం చాలా అరుదుగా చోటు చేసుకునేదిగా చెప్పక తప్పదు. ఇవాల్టి చంద్రగ్రహణం స్పెషాలిటీ ఏమంటే.. ఆషాఢ పౌర్ణమి అంటే.. గురుపౌర్ణిమ రోజున చంద్రగ్రహణం చోటు చేసుకోవటం. నిండుగా పున్నమి చంద్రుడు ఉండే ఈ రోజు దశలవారీగా కనుమరుగు అవుతూ మళ్లీ తన నిజరూపాన్ని ప్రదర్శించటం చాలా ప్రత్యేకత సంతరించుకున్న అంశం.

ఇలాంటిది 150 ఏళ్ల క్రితం అంటే 1870 జులై 12న వచ్చింది. ఇన్నాళ్ల తర్వాత వచ్చిన ఈ చంద్రగ్రహణం అరుదైనదే కాదు.. ప్రభావం కూడా ఎక్కువే అంటున్నారు. కాకుంటే.. అర్థరాత్రి 1.30 గంటలకు ధనస్సు రాశిలో ప్రారంభమై బుధవారం తెల్లవారుజామున 4.31 గంటలకు మకర రాశిలో ముగియనుంది. మొత్తం 178 పాటు ఉండే ఈ గ్రహం మనకు పాక్షికంగానే కనిపిస్తుంది. ఈ రోజు గ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో స్టార్ట్ అయి రెండో పాదంలో ముగియనుంది.అన్ని గ్రహణాల మాదిరే తాజా చంద్రగ్రహణం అని సైంటిస్టులు చెబుతుంటే.. పండితులు.. జ్యోతిష్యులు మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. జ్యోతిష్యం మొత్తం సూర్య చంద్రుళ్ల కదలిక మీద ఉన్న నేపథ్యంలో.. వారు చెప్పే దాని ప్రకారం.. కొన్ని రాశుల వారికి ఏ మాత్రం అనుకూలంగా ఉండదని.. కొన్ని రాశుల వారికి బ్రహ్మండంగా ఉంటుందని చెబుతున్నారు.

పండితులు చెబుతున్న దాని ప్రకారం వృషభ.. మిథున.. కన్య.. ధనుస్సు.. మకరరాశుల వారికి చంద్రగ్రహణం అధమ ఫలితాల్ని ఇస్తుందని.. తుల.. కుంభ రాశుల్లో పుట్టిన వారికి మధ్యమ ఫలితాల్ని ఇస్తుంది. మేష.. కర్కాటక.. వృశ్చిక.. సింహ.. మీన రాశుల్లో జన్మించిన వారికి మాత్రం విశేష ఫలితాల్ని ఇస్తుందని చెబుతున్నారు.అదే విధంగా ఉత్తరాషాఢ.. పూర్వాషాఢ.. శ్రవణ నక్షత్రాల్లో పుట్టిన వారు.. ధనుస్సు.. మకర రాశుల్లో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదంటున్నారు. అయితే.. గ్రహణం ఏర్పడే సమయంలో అర్థరాత్రి 1.30 గంటలనుంచి తెల్లవారుజాము వరకూ సాగుతున్న నేపథ్యంలో అందరూ మంచి నిద్రలో ఉంటారు కాబట్టి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇక..గ్రహణ సమయానికి నాలుగు గంటల ముందు భోజనం చేయటం మంచిదన్న పాయింట్ ఎప్పటిలానే కామనే.

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *