వంగిపోయిన వెన్నెముక‌కు శస్త్ర చికిత్స

వేగంగా పెరుగుతున్న వెన్నెముక‌ వైకల్యం, శరీరంలోని మొండెం పై భాగం ఒకవైపు వంగినట్లు పెద్దదిగా మారుతూ, నడవడానికి అవస్థలు పడుతూ , వెన్నునొప్పి తో పాటు గాశరీర సౌష్టవ నిర్మాణం ఒక వైపు వంగుతూ తీవ్రమైన గూని సమస్యతో ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణదానం చేశారు.

వరంగల్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడికి ఎనిమిదేళ్ల వయస్సులో వెన్నెముక‌ వంకర పోతున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. దాంతో స్థానికంగా ఉండే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు. ఎక్స్ రే తీసిన అక్కడి డాక్టర్లు పుట్టుకతో వీపులో వచ్చే ఎంతో సంక్లిష్టమైన వెన్నెముక వైకల్యం(గూని) బాలుడిలో వృద్ధి చెందుతున్నట్లు గమనించారు. సంక్లిష్టమైన వెన్నుపూస ఎముకలు, పక్కటెముకలు క‌లిసిపోయి వయస్సుతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు చాలా మంది వైద్యులు మరియు సర్జన్ల నుంచి వైద్య సలహా తీసుకున్నారు. వారి కుమారుడి వైకల్యం చాలా క్లిష్టమైనదని తెలుసుకున్న తరువాత, అతడి వెన్నెముక‌ సమస్యతో క్రమంగా అతడి కాళ్లు మరియు మూత్రాశయంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదముందని తెలుసుకున్నారు.

వెంటనే బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. బాలుడిని కిమ్స్ కన్సల్టెంట్, వెన్నెముక‌ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ సురేశ్ చీకట్ల పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చినప్పటికే బాలుడి కుడి భుజం తుంటి ఎముక దగ్గరికి కుచించుకుపోయి ఉంది. అదే విధంగా కడుపు లోపలికి లాగబడి, ఛాతీ ముందుకు నెట్టినట్లు ఉంది. బాలుడి శరీరం వెనుక భాగంలో క్రమంగా ఒక మూపురంతో పాటు ఛాతీ అంతర్భాగం వెన్నుముక ఎముక‌లు అతుక్కుపోవ‌డం వ‌ల్ల కూడా వంకర తిరిగినట్లుగా ఉంది. పక్కటెముకలు మరియు వెన్నెముక ఎముకలు లోపలికి వత్తినట్లుగా మారి బాలుడిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇలా సంక్షిష్టమై సమస్య తీవ్రతలు వేగంగా వృద్ధి చెంది వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాపాయం కూడా ఉన్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ సందర్భంగా బాలుడి పరిస్థితి, అతడికి చికిత్స నందించిన తీరును కిమ్స్ కన్సల్టెంట్, వెన్నెముక శస్త్ర చికిత్సల నిపుణులు డాక్టర్ సురేశ్ చీకట్ల వివరించారు. ‘‘బాలుడిని పరిశీలించిన తర్వాత పలు పరీక్షలు నిర్వహించాం. ఎక్స్ రే , పూర్తిగా వెన్నెముక‌ను సి.టి స్కానింగ్, అదే విధంగా ఇలా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. ‘ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ టైప్ ఆఫ్ కాంజినిట‌ల్ డోర్సల్ కైఫీ స్కోలియాసిస్’ అనే సమస్యతో బాలుడు బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. శస్త్రచికిత్సకు ముందు కార్డియాలజిస్టుల మరియు పల్మనాలజిస్టులతో సంప్రదించి సర్జరీ పై వారి అభిప్రాయాలు తీసుకున్నాం. వీపులోని వెన్నుముక ఎముక‌లు అతుక్క‌పోవ‌డం వ‌ల్ల‌, వాటిలోకి స్క్రూలు బిగించి వంక‌ర‌ను స‌రిద్ద‌డానికి అధునాతన పరికరాలైన ఓ ఆర్మ్, అనునిత్యం న్యూరో పర్యవేక్షణకు మరియు వెన్నెముక నావిగేషన్ పరికరాలతో సర్జరీ చేయాలని నిర్ణయించాం. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులకు ఖర్చు తగ్గించేందుకు ఈ తరహా పరికరాలతో ఆపరేషన్ చేసి ఖర్చును తగ్గించాలని నిర్ణయించుకున్నాం. ఈ సర్జరీకి సాధారణంగా ఒక దశలో పూర్తి చేయాలంటే 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. కానీ ఒకే చికిత్స ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాం.

సర్జరీని అనస్థీషియా బృందం హెడ్ డాక్టర్ నరేశ్ కుమార్ సహకారంతో శస్త్రచికిత్సను ప్రారంభించాం. వంగిపోయిన వెన్నెముక‌ను ఇంట్రా-ఆపరేటివ్ న్యూరో-మానిటరింగ్ మరియు ఓ-ఆర్మ్ సహాయంతో ఎటువంటి సమస్యలు లేకుండా సరిచేశాం. శస్త్రచికిత్స చేసిన అదే రోజున బాలుడు వేగంగా కోలుకుని నడవడానికి కూడా సిద్ధమయ్యాడు. కాళ్ల‌లో, మూత్రాశ‌యంలో కూడా ఎలాంటి బ‌ల‌హీన‌త క‌నిపించ‌లేదు. అనంతరం మూడు రోజుల డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి చక్కగా నడుస్తుండడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించాం. బాలుడు మరియు అతని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. కిమ్స్ ఆసుపత్రుల వైద్య బృందం మరియు యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article