నూజివీడు ఆరోగ్య హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్స

నూజివీడు ఆరోగ్య హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్స.

ఓ మహిళ కడుపులో నుండి 16 కేజీల కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు.

గత సంవత్సర కాలంగా గర్భసంచిలో అతి చిన్నగా ప్రారంభమై 16 కేజీల వరకు పెరిగిన అతి అరుదైన కణితిని నూజివీడు ఆరోగ్య హాస్పిటల్ వైద్య బృందం శుక్ర

వారం సాయంత్రం విజయవంతంగా తొలగించింది. వివరాల్లోకి వెళితే ముసునూరుకు చెందిన జె.సత్యవాణి (45) కడుపు ఉబ్బరంతో గత ఏడాది కాలంగా బాధపడుతూ పలు ప్రాంతాల్లో అనేక హాస్పిటల్ కు తిరిగి రోగనిర్ధారణ జరగకపోవడంతో గురువారం సాయంత్రం నూజివీడు ఆరోగ్య హాస్పిటల్ ఎండి డా. చలసాని దంతేష్ ను కలిశారు. బాధితురాలికి సంబంధించి అల్ట్రా స్కాన్ చేసిన అనంతరం గర్భసంచిలో కణితి ఉందని గుర్తించిన వైద్యులు తక్షణం దానిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో డాక్టర్ జి నవీన్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు వైద్యుల బృందం జి నవీన్ కుమార్ సాహితీ, డా. చలసాని దంతేష్ దాదాపు గంటన్నర సేపు శ్రమించి గర్భసంచిలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాధితురాలు క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యంత తక్కువ ఖర్చుతో కేవలం 30 నుంచి 35 వేల రూపాయలు తో శస్త్ర చికిత్స చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య హాస్పటల్లో 16 కేజీల అరుదైన కణితిని విజయవంతంగా తొలగించడం చెప్పలేని ఆనందంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వైద్య సిబ్బందికి బాధిత మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article