ర‌ష్మిక క‌మిట్‌మెంట్‌

Rashmika Commitment for Movies
క‌న్న‌డ నుండి తెలుగులోకి `ఛ‌లో`తో ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అందుకున్న హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా. త‌ర్వాత `గీత గోవిందం`బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. తెలుగులో ఇప్పుడు `డియ‌ర్ కామ్రేడ్‌` సినిమాలో న‌టిస్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక క్రికెట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ఆ పాత్ర కోసం ర‌ష్మిక క్రికెట్ ఆడ‌టం కూడా నేర్చుకుంది. కాగా ఇప్పుడు లుక్ కోసం.. హెయిర్ పెద్ద‌గా ఉండేలా కాకుండా, హెయిర్ క‌ట్ చేయించుకోనుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ర‌ష్మిక క‌మిట్‌మెంట్‌ను యూనిట్ అభినందిస్తుంది. `గీత‌గోవిందం` త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండతో ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తున్న చిత్ర‌మిది
Latest movie update on filmy update, movie reviews, trailers launch, Cinemas
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article