నానితో అంటే రష్మిక ఒప్పుకుంటుందా..?

41
rashmika movie update
rashmika movie update

rashmika movie update

రష్మికం మందన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ లోనే ఉన్న బ్యూటీ. ఛలో అంటూ టాలీవుడ్ లోకి పొలోమంటూ వచ్చిన ఈ భామ ఆ తర్వాత నాని సరసన దేవదాస్ లో నటించింది అన్న విషయం చాలామందికి గుర్తు కూడా ఉండకపోవచ్చు. అందుకు ఆ సినిమా పోవడం ఓ కారణమైతే.. రష్మిక పాత్ర సినిమాలో చాలా పరిమితంగా ఉండటం మరో కారణం. ఆ తర్వాత తను రేంజ్ గీత గోవిందంతో మారిపోయింది. ఆ మూవీ తర్వాత తనిప్పుడు మోస్ట్ బిజీ అయిపోయింది. అటు తమిళ్ లో సైతం ఆఫర్స్ పట్టేస్తోంది. అయితే రీసెంట్ గా రష్మిక చిన్న హీరోల సరసన నటించకూడదు అనే నిర్ణయం తీసుకుంది అనే వార్తలు వచ్చాయి. తనలాగే పూజాహెగ్డే కూడా ఆలోచిస్తుంది అంటారు. మరి ఈ టైమ్ లో తను మరోసారి నాని సరసన నటించేందుకు ఓకే చెబుతుందా అనేదే అందర్లోనూ వినిపిస్తోన్న ప్రశ్న. నాని చిన్న హీరోనా అనే డౌట్ రావొచ్చు. కానీ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటిస్తోన్న తను త్వరలోనే రామ్ చరణ్ తో ఆచార్యలోనూ నటించే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఈ స్టార్స్ రేంజ్ తో పోలిస్తే నాని రేంజ్ చిన్నదే కదా.

అందుకే తనతో మళ్లీ ఓకే అంటుందా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది కదా. అది సరే.. ఇంతకీ అసలు ఏ సినిమా కోసం తనను అడుగుతున్నారు అనే అనుమానం వచ్చింది కదూ. నాని హీరోగా సితార బ్యానర్ లో టాక్సీవాలా ఫేమ్ శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం రష్మికను సంప్రదిస్తున్నారట. ఆల్రెడీ ఈ మూవీలో సాయి పల్లవి ఓకే చెప్పింది అని చెప్పారు. అంటే ఇద్దరు హీరోయిన్లన్నమాట. పైగా పీరియాడిక్ సబ్జెక్ట్. కొంత భాగం కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అలాగే ఇద్దరు హీరోయిన్ల పాత్రలకూ మంచి స్కోప్ ఉంటుందట. యాక్టింగ్ పార్ట్ లో సాయి పల్లవి స్కోర్ చేసినా.. గ్లామర్ పరంగా రష్మిక ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ మధ్యే ఓ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రష్మికను సంప్రదిస్తున్నారట. మరి దేవదాస్ ఎక్స్ పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని నో అంటుందా లేక బ్యానర్ తో పాటు నాని రేంజ్ కోసం ఎస్ అంటుందా అనేది చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here