యాదాద్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి

యాదాద్రిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి దాదాపు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ రియల్టర్ జక్కిడి ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి తమ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు ఆ ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. ఈ సందర్భంగా 20 కార్లు, 60 బైకులతోపాటు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీలో పాల్గొన్న ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులతోపాటు పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article