`బంగారు బుల్లోడు` భామ‌కు అరుదైన గౌర‌వం

Raveena Tandon got Special Respect
`బంగారు బుల్లోడు`, `పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌` చిత్రాల్లో న‌టించిన ర‌వీనా టాండెన్‌కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎంప‌వ‌ర్‌మెంట్ స‌మ్మిట్ ఈ ఏడాది ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ర‌వీనాను కేంద్ర మ‌హిళా, శిశు సంక్షేమ అభివృద్ది శాఖ‌, బేటీ బ‌చావో బేటీ ప‌డావో మిష‌న్ సంయుక్తంగా ఆమెను గౌర‌వించ‌నున్నాయి. దీని గురించి ర‌వీనా మాట్లాడుతూ “నాకు ఈ విష‌యం చెప్ప‌గానే చాలా గౌర‌వంగా అనిపించింది. ఎందుకంటే నేను 21వ శతాబ్దంలో ఉన్నాను. మహిళా సాధికార‌త సాధిస్తున్న స‌మ‌యం ఇది. లింగ వివ‌క్ష‌కు దూరంగా ఉన్న త‌రుణ‌మిది. ఫెమినిజం అనే మాట‌కు అస‌లు సిస‌లైన అర్థం చెప్ప‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మ‌హిళ‌లు ఇంకా అభివృద్ధి కావాలి“ అని అన్నారు.
For More Click Here
More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article