రవిబాబుది క్రష్ నా లేక రివెంజా..?

22
ravi babu movie update
ravi babu movie update

ravi babu movie update

టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ లో ఒకడు రవిబాబు. నటుడుగానూ సత్తా చాటిన రవిబాబు దర్శకుడుగా ఒకప్పుడు మినీ బడ్జెట్ మూవీస్ తో మంచి విజయాలు సాధించాడు. ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేస్తూ ఆయన తీసిన అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, నువ్వలా, మనసారా, అవును వంటి సినిమాలు కమర్షియల్ గానూ మంచి విజయాలు సాధించాయి. అయితే తర్వాతే గాడి తప్పాడు. అవును తర్వాత తీసిన సినిమాలేవీ ఆకట్టుకోలేదు. ఏకంగా ఆరేడేళ్లుగా అతనికి మినిమం హిట్ కూడా లేదు. రీసెంట్ గా ఓ పందిపిల్లతో చేసిన ప్రయోగం కూడా దారుణంగా బెడిసికొట్టింది. అలాగే ఆవిరి అంటూ మరో సినిమా వచ్చింది. కానీ ఈ మేటర్ ఆడియన్స్ కూ తెలియదు. మరి ఏమైందో కానీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆల్ట్ బాలాజీ తరహాలో చాలా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. వీటిలో అన్నీ బూతు సినిమాలే ఉంటాయి. లెంగ్త్ కూడా మరీ ఎక్కువేం ఉండదు. కానీ వెల్లువలా రూపొందుతున్నాయి ఆ తరహా సినిమాలు, వెబ్ సిరీస్ లు. ఇంకా చెబితే కంటెంట్ తో కూడా పెద్దగా పనిలేదు. ప్రస్తుతం రవిబాబు కూడా ఆ రూట్ లోనే వెళుతున్నాడా అనేందుకు అతని లేటెస్ట్ క్రష్ కనిపిస్తోంది. తను మంచి సినిమాలు చేస్తున్నాననీ, గొప్ప టెక్నీషియన్ ను అనే భావన రవిబాబులో బలంగా ఉంటుంది. కానీ సినిమాలు పోతున్నాయి.

దీంతో ఆడియన్స్ పై కోపంతోనే రివెంజ్ కోసం ఇలాంటి బూతు సినిమా చేశాడా అంటూ ఓ రేంజ్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ తరహా దాడులే చేస్తున్నాడు ప్రేక్షకులపై. ఇప్పుడు రవిబాబు కూడా ఆ రూట్ లోకి వచ్చాడు.  ఈ క్రష్ అనే మూవీ ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారో కానీ.. కంటెంట్ మొత్తం టీనేజ్ పిల్లలనే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. డైలాగ్స్ నుంచి సీన్స్ వరకూ ఇదో బి గ్రేడ్ తరహా సినిమా అని తెలుస్తోంది. ఇలాంటి సినిమాతో రవిబాబు ఏం క్యాష్ చేసుకుంటాడు అనేది పక్కన బెడితే ఖచ్చితంగా యూత్ ను చెడగొట్టేందుకు ఈ తరహా సినిమాలు బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు. గతంలో మిణుగురులు అనే సినిమా చేశాడు అయోధ్యకుమార్ అనే దర్శకుడు. ఆ సినిమా అద్భుతం అని రివ్యూస్ వచ్చాయి. కానీ రెవిన్యూ రాలేదు. దీంతో  ఇలా కాదని తనూ ఓ హాట్ మూవీ చేస్తానని కోపంతో 24 కిస్సెస్ అనే మూవీ చేశాడు. ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. కంటెంట్ లేకుండా సినిమాలు చేసి ఆడియన్స్ కు టేస్ట్ లేదని ఫీలయ్యే వాళ్లంతా ఇలాగే చేస్తారేమో.. ఏదేమైనా రవిబాబు క్రష్ పడి మరీ ఆడియన్స్ పై రివేంజ్ కే రెడీ అయ్యాడనిపిస్తోంది కదూ.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here