‘ఏజెంట్’ మాస్ మహరాజ్ రవితేజ

47
raviteja movie
raviteja movie

Ravi teja movie

మాస్ మహరాజ్ గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్టార్ రవితేజ. స్వయంకృషితో ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రవితేజ. ఒక్కోసారి అతి అనిపించినా తనకంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలోని నిర్లక్ష్యం.. వెరసి అతన్ని మాస్ హీరోగా ఓ రేంజ్ లో నిలిపాయి. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు రవితేజ. ఓ దశలో మాస్ రాజా పని ఐపోయింది అన్నవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ సమాధానం చెప్పే ఓ భారీ హిట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. త్వరలోనే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘క్రాక్’ సినిమాతో రాబోతున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఇంకా కొన్ని రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. క్రాక్ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంతకుముందు రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. దీంతో ఈ కాంబో హ్యాట్రిక్ కొడుతుందనుకుంటున్నారు చాలామంది.

మరోవైపు ఆల్రెడీ మూడు కొత్త ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకుని ఉన్నాడు రవితేజ. రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒకటి.. అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా.. చేస్తున్నాడు. మరో సినిమా లైన్ లో ఉంది. అయితే వీటిలో ఓ సినిమాలో రవితేజ పూర్తిగా కామెడీ సినిమానే చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. సాధారణమైన కథలు మాస్ కోటింగ్ ఇచ్చి.. ఆయా హీరోల బాడీ లాంగ్వేజెస్ కు అనుగుణమైన కథనంతో కమర్షియల్ విజయాలు సాధించడం దర్శకుడు నక్కిన త్రినాథరావు స్టైల్. అతను కూడా ఆ స్టైల్ ను కాస్త మార్చుకుని రవితేజ కోసం అవుట్ అండ్ కామిక్ రోల్ క్రియేట్ చేశాడట. ఈ మూవీలో కథ ప్రకారం రవితేజ ఓ స్మాల్ టౌన్ సీక్రెట్ ఏజెంట్ లా కనిపిస్తాడని.. ఆ పాత్ర అస్సలే మాత్రం సీరియస్ గా కనిపించదనీ అంటున్నారు. ఇలా చెబితే గతంలో జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి చేసిన చంటబ్బాయ్ సినిమా గుర్తొస్తోంది కదూ. నిజమే.. ఆ తరహా కథనే ఈ కాలానికి అనుగుణమైన కథనంలో త్రినాథరావు సినిమా నడిపించబోతన్నాడు అంటున్నారు. ఇక రీసెంట్ గా కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే స్మాల్ టౌన్ ఏజెంట్ కథ సూపర్ హిట్ అయింది కదా. అలాగే రవితేజకు కూడా మరో హిట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here