పీరియాడిక్ రివేంజ్ చిత్రంలో ర‌వితేజ‌

Ravi Teja Was acting In Periodical Drama
మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప‌ట్స్‌ని  త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని  అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు `డిస్కో రాజా` అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేశారు. ఈ టైటిల్‌లోగోను చూస్తుంటే ఇందులో ర‌వితేజ ఈజ్ అని కాకుండా వాస్ అని లోగో ఉంది. అంటే ఇది పీరియాడిక్ చిత్ర‌మ‌ని తెలుస్తుంది. అలాగే టేప్ రికార్డ‌ర్‌, వీసీడీ ప్లేయ‌ర్‌లోని ప్లే, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ త‌ర్వాత ప్లే స్థానంలో కిల్ అనే అప్ష‌న్‌ను ఇవ్వ‌డం ద్వారా ఇది రివేంజ్ చిత్ర‌మ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ ట‌చ్ చేయ‌ని జోన‌ర్ చిత్ర‌మిది.  హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాయ‌ల్‌రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా న‌భా న‌టేష్‌, ప్రియా జ‌వాల్క‌ర్ కూడా సినిమాలో న‌టించ‌బోతున్నార‌నేది స‌మాచారం. కాగా ఈ సినిమాలో త‌మిళ న‌టుడు బాబీ సింహ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article