రవితేజ సింగిల్ .. అయినా నో హ్యాపీ..?

Ravi Teja Tensions Surrounding Disco Raja

ఎవరికైనా సింగిల్ రిలీజ్ డేట్ దొరికితే చాలా హ్యాపీగా ఫీలవుతారు. కానీ రవితేజలో ఆ సంతోషం కనిపించడం లేదు. ఈ శుక్రవారం డిస్కోరాజా మాత్రమే విడుదలవుతుంది. కనీసం మరో చిన్న సినిమా కూడా లేదు. అంటే సోలో రిలీజ్ అనేది చిన్న విషయం కాదు. అయినా మాస్ రాజాలో ఆ జోష్ కనిపించడం లేదు. కారణమేంటనేది అందరికీ తెలుసు. పది రోజుల క్రితం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలకు ఇంకా ఆదరణ తగ్గలేదు. దీంతో ఆ సినిమాలతోనే డిస్కోరాజా పోటీ పడాల్సి వస్తోంది.

సరిలేరు, అల సినిమాలకు క్రేజ్ ఇంకా తగ్గలేదు. థియేటర్స్ కూడా మాగ్జిమం ఫుల్ అవుతున్నాయి. దీంతో పాత సినిమాలతోనే రవితేజ కొత్తగా పోటీ పడాల్సి వస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాపై వీళ్లు పెద్దగా హోప్స్ పెట్టుకోలేదంటున్నారు. మరోవైపు సెన్సార్ టాక్ కూడా తేడాగా వినిపిస్తోంది. అలాగని ఆ టాక్ నిజమే అనుకోలేం. బట్.. సోలో రిలీజ్ అయినా.. సింగిల్ గా వస్తోన్నా కూడా రవితేజ అండ్ టీమ్ లో ఆ హ్యాపీనెస్ కనిపించడం లేదంటున్నారు. సో మరికొన్ని గంటల్లో రిజల్ట్ కూడా తెలిసిపోతుంది కాబట్టి.. అసలు మినిమం హ్యాపీనెస్ అయినా ఉంటుందా లేక డబుల్ అవుతుందా అనేది తేలిపోతుంది.

Ravi Teja Tensions Surrounding Disco Raja,Hero Raviteja,#Thaman #DiscoRaja,Sarileru Neekevvaru,Ala Vaikuntapuramloo,Releasing Tensions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *