ర‌వీంద‌ర్ సింగ్ సీఎంను ఎందుకు క‌లిశారు?

62

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పోటీచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్థానిక సంస్థలలో నెలకొని సమస్యలు మరియు సిక్కు సామాజిక వర్గం 1832 నుండి ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో అన్నింటికీ సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రానున్న రోజులలో సమస్యలను పరిష్కారం చేసుకుందాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సర్దార్ రవీందర్ సింగ్ వెంట నాయకులు సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్, మరియు సిక్కు సమాజిక వర్గం నాయకులు ఎక్బల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్ సింగ్, దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here