రవిప్రకాష్ కు అక్టోబర్ 18వరకు రిమాండ్

108
Raviprakash remanded till October 18
Raviprakash remanded till October 18
Raviprakash remanded till October 18

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్  చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆయనకు కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది.   చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు రవి ప్రకాష్ .  రవిప్రకాష్‌కు జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీ నెంబర్ 4412 కేటాయించి.. కృష్ణా బ్యారక్‌లో.. వైట్ కాలర్ బ్యారెక్ లో ఉంచారు. మిగతా ఖైదీలతో పాటు రవిప్రకాష్‌ను  జైలు అధికారులు ఒకే బ్యారెక్ లో ఉంచారు . ఏసీబీ కేసులో నిందితులతో కలిసి ఉన్న రవిప్రకాష్ ఎవరితోనూ రాత్రంతా.. మట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం. ఈరోజు ఉదయం అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా.. సగం తిని వదిలేసినట్టు తెలుస్తోంది.
కాగా.. రవి ప్రకాష్ నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిలో రూ.18కోట్ల మేర నిధులను డైరక్టర్లకు తెలియకుండా దారి మళ్లించినట్లు టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవి ప్రకాశ్, మూర్తి కలిసి సుమారు రూ.18 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేసినట్లు యాజమాన్యం గుర్తించింది. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని అలందా మీడియా ఆరోపిస్తుంది . ఇక ఇందులో టీడీఎస్ పోగా.. రూ.11.74 కోట్లు విత్ డ్రా చేసినట్లు రికార్డుల్లో తేలింది. రవి ప్రకాష్‌పై సెక్షన్ 409,420,418 కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు.రవిప్రకాష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలున్నాయని.. డీసీపీ సుమతి తెలిపారు. కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా.. చాలా అవకతవకలకు పాల్పడ్డారని.. ఈకేసుపై దర్యాప్తు చేస్తున్నామని సుమతి వెల్లడించారు.

tags : tv9, former ceo, ravi prakash  cheating case, remand, alanda media, chanchalguda jail

https://tsnews.tv/6th-day-rtc-workers-strike/
https://tsnews.tv/cm-kcr-should-put-in-jail/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here