Raviteja in Confusion
మాస్ మహారాజ్ రవితేజకి అర్జెంటుగా ఒక కమర్షియల్ హిట్ కావాలి! రాజా ది గ్రేట్ తరువాత వరుసగా వచ్చిన సినిమాలన్నీ కనీసం యావరేజ్ టాకైనా తెచ్చుకోలేకపోయాయి. అమర్ అక్బర్ ఆంటనీ తరువాత… ప్రస్తుతం ఐవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు రవితేజ. అయితే, ఇది ప్రయోగాత్మక కథాంశంగా తెలుస్తోంది. ఈ సినిమా సాంకేతికంగా కొత్తగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అందువల్లే షూటింగ్ కూడా అనుకున్న టైం కంటే బాగా ఆలస్యమౌతోంది. ఈ సినిమాలో రవితేజని కొత్తగా చూపించేందుకు టీం కష్టపడుతోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. దీంతో, తరువాత ఏ సినిమా ఓకే చెయ్యాలీ అనేదానిపై రవితేజ కాస్త ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
పక్కా కమర్షియల్ ఫార్ములాతో ఒక మాస్ సినిమా చేయాలనే ఆలోచనలో రవితేజ ఉన్నట్టు తెలుస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో అలాంటి కథను సిద్ధం చేయమని ఇంతకుముందే రవితేజ చెప్పాడట. అయితే, గోపీచంద్ తీసుకొచ్చిన స్టోరీ లైన్ రవితేజకి పెద్దగా ఎక్కలేదనీ, చాలా కరెక్షన్లు చెప్పాడనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతోపాటు, మరో కథను రవితేజ విన్నట్టుగా సమాచారం. ఆ కథ తన కెరీర్ లో మంచి సినిమా నిలిచే ఛాన్స్ ఉందనీ, కచ్చితంగా చేస్తానంటూ ఓ నిర్మాతకు రవితేజ మాటిచ్చాడట. అయితే, గోపీచంద్ మలినేని చిత్రాన్ని ముందు చెయ్యాలా… లేదంటే, మాటిచ్చిన నిర్మాతకు ముందు చెయ్యాలా అనే చిన్న కన్ఫ్యూజన్ లో రవితేజ ఉన్నాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎలాగూ కొంత ప్రయోగాత్మకంగానే ఉండే అవకాశాలున్నాయి కాబట్టి, వెంటనే కమర్షియల్ ఎంటర్టైన్ చేస్తే బెటర్ అని భావిస్తున్నాడట. అయితే, రాజా ద గ్రేట్ లో హీరో పాత్ర డిఫరెంట్ గా ఉండి కాబట్టే… మంచి హిట్ వచ్చింది. కాబట్టి, రొటీన్ కమర్షియల్స్ కి దూరంగా ఉంటే బెటరేమో అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం.