ఆ సినిమా నుంచి రవితేజ అవుట్ ..?

27
raviteja movie update
raviteja movie update

raviteja movie update

మాస్ మహరాజ్ రవితేజను ఒక సినిమా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా మరో స్టార్ హీరో వల్ల. నిజానికి ఈ సినిమాను కూడా రవితేజ అంత ఇష్టంతో ఏం ఒప్పుకోలేదు. తన సినిమాల లైనప్ పెంచుకునే పనిలో భాగంగానూ.. ఆ బ్యానర్ వల్ల ఓ కారణంగానూ సినిమాను ఒప్పుకున్నాడు అనుకున్నారు కూడా. పైగా ఇది ఓ రీమేక్. ఇక సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుండగా.. సడెన్ గా మరో స్టార్ ఆ మూవీలో తల దూర్చాడు. దీంతో ప్రాజెక్ట్ నుంచి రవితేజను తీసేయొచ్చు అనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థ కూడా ఎటూ తేల్చుకుండా ఆపేస్తోందనే విమర్శలూ వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. మళయాలంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ రైట్స్ ను తీసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఈ చిత్రాన్ని తెలుగులో రానా, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందించాలనుకుంది ఈ బ్యానర్. అయితే బాలయ్య సినిమా చూశాక నో చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కు సైతం ఓ షో వేశారు.

కానీ మొదట్లో పవన్ ఈ మూవీ తనకు సెట్ కాదు అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నో చెప్పిన తర్వాత ప్రాజెక్ట్ లోకి రవితేజ ఎంటర్ అయ్యాడు. అయ్యప్పనుమ్ కథలో రవితేజ పోలీస్ గా రానా పొలిటీషియన్ కొడుకుగా బాగా సెట్ అవుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ సినిమా నేనే చేస్తాను అని పట్టుబడుతున్నాడట. ఈ మేరకు త్రివిక్రమ్ కూడా రంగంలోకి దిగి.. అతనికి అనుగుణంగా అయ్యప్పనుమ్ కథలో కొన్ని మార్పులు  కూడా చేశాడని చెబుతున్నారు. హారిక హాసిని బ్యానర్ కు చెందినదే.. సితార బ్యానర్. మరి ఈ బ్యానర్ పవన్ కళ్యాణ్ ను కాదు అనుకోలేదు. కాదని చెప్పనూ లేదు. అందుకే ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట. ఇక త్రివిక్రమ్ కథ పవన్ కు నచ్చితే స్మూత్ గా చెబితే ఆటోమేటిక్ గా రవితేజ తప్పుకోవాల్సిందే. లేదంటే వాస్తవంగా చెబితే అతన్ని తప్పించేస్తారంతే.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here