మాస్ రాజా ‘క్రాక్’ స్టార్ట్ చేశాడు

48
raviteja movie
raviteja movie

raviteja movie

మాస్ మహరాజ్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న హీరో రవితేజ. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అందుకు ప్రధాన కారణం అతను ఎంచుకుంటోన్న కథలే అనేది కాదనలేని సత్యం. అలాగని.. అతనిలో పస అయిపోయింది అని చెప్పలేం. కాస్తైనా కంటెంట్ ఉంటే తన కెపాసిటీతో పాస్ చేయించగలడు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అతి సాధారణమైన కథతో వచ్చిన రాజా ది గ్రేట్. ఇదే కథను మరే హీరో చేసిన దారుణమైన విమర్శలు వచ్చేవి. ఇలాగే ఒక హిట్ నాలుగు ఫ్లాపులు అన్న చందంగా సాగుతోంది మాస్ రాజా కెరీర్. ఆశ్చర్యంగా అన్ని ఫ్లాపులున్నా అతనికి ఆఫర్స్ తగ్గలేదు. ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. త్వరలోనే మరో సినిమా అనౌన్స్ అవుతుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. మామూలుగా కరోనా లేకుంటే ఇప్పటికే విడుదల కూడా అయి ఉండేదీ సినిమా. అయితే మార్చిలోనే షూటింగ్ పూర్తవుతుంది అనుకున్నా.. కరోనా కారణంగా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉండిపోయింది. ఆ పార్ట్ ను నేటి నుంచి చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే కొన్ని సెట్స్ వేసి కోవిడ్ -19కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ మొదలుపెట్టారు. ఇవాళ రవితేజ పైనే కొన్ని క్రూషియల్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు.

దీంతో స్టార్ హీరోలు షూటింగ్స్ రావడానికి రవితేజ కూడా ఓ కొత్త రూట్ వేసినట్టైంది. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సాగే క్రాక్ సినిమాలో రవితేజ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన ‘సేతుపతి’అనే సినిమా నుంచి ఇన్స్ స్సైర్ అయిన కథ అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇక ఇంతకు ముందు రవితేజ హీరోగా నటించిన డాన్ శీనుతోనే దర్శకుడుగా పరిచయమయ్యాడు గోపీచంద్ మలినేని. తర్వాత వీరి కాంబోలో బలుపు అంటూ మరో హిట్ వచ్చింది. ప్రస్తుతం రవితేజ మాత్రమే కాదు.. దర్శకుడు కూడా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సిట్యుయేషన్ లో ఉన్నారు. మరి ఈ క్రాక్ తో ఈ ఇద్దరూ కలిసి హిట్టెక్కుతారా లేదా అనేది చూడాలి. అన్నట్టు సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు అనే టాక్ వినిపిస్తోన్నా.. మాగ్జిమం సంక్రాంతి బరిలోనే నిలిచే అవకాశాలున్నాయనుకోవచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here