`ఎఫ్‌3`లో ర‌వితేజ ఉన్నాడా?

Will Ravi teja in “F3”
ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన చిత్రం `ఎఫ్ 2`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌కు సీక్వెల్‌గా `ఎఫ్‌3` ఉంటుంద‌ని.. దీనికి వెంకీ, వ‌రుణ్ కూడా ఆస‌క్తిగానే ఉన్నార‌ని ఇది వ‌ర‌కు చెప్పేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో ర‌వితేజ కూడా న‌టించ‌బోతున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అనిల్‌రావిపూడి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `రాజాదిగ్రేట్‌` చిత్రంలో ర‌వితేజ అంధుడి పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడు ఆ పాత్ర‌నే సీక్వెల్‌లో కంటిన్యూ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. అయితే ఈ సీక్వెల్‌ను అనిల్ రావిపూడి వెంట‌నే ప్రారంభిస్తాడా? స‌మ‌యం తీసుకుంటాడా? అని తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే..

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article