2 వికెట్లతో గెలిచిన బెంగళూరు

హర్షల్ పటేల్ చివరి బంతికి పరుగు తీసి బెంగళూరును గెలిపించడం కొసమెరుపు.

141
RCB WON FIRST IPL MATCH
RCB WON FIRST IPL MATCH

చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మొదటి ఐపీఎల్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. చివరి ఓవర్లో ఏబీ డివిలీయర్స్ ఔటవ్వడంతో గెలుపుపై ముంబై ఇండియన్స్ లో ఆశలు చిగురించాయి. కాకపోతే, హర్షల్ పటేల్ ఎక్కడా ముంబైకి అవకాశం ఇవ్వకుండా చివరి బంతికి పరుగు తీసి ముంబై ఇండియన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. మొత్తానికి, ప్రేక్షకుల్లేకుండా జరిగిన ఈ మ్యాచు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు ఫర్వాలేదనిపించారు. బెంగళూరు జట్టులో హర్షల్ పటేల్ ఐదు వికెట్లు తీసి ముంబైని గట్టిగా దెబ్బతీశారు. మళ్లీ అదే హర్షల్ పటేల్ చివరి బంతికి పరుగు తీసి బెంగళూరును గెలిపించడం కొసమెరుపు. గత తొమ్మిదేళ్లుగా మొదటి మ్యాచు ఓడిన రికార్డును ముంబై నిలబెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here