పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో అనీల్ అంబానీ

RCom loan default case

దేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే ముకేశ్ అంబానీ అతడి సోదరుడు అనిల్ అంబానీ అని చెప్పేవారు. అది ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న అనిల్ అంబానీ బికారయ్యాడు. ఆయన ఆర్థికంగా అత్యంత దారుణ  పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తన దగ్గర రూపాయి కూడా లేదని ప్రకటించాడు. దీంతో ఆయన పరిస్థితి ఎంత క్షీణ దశకు చేరిందో అర్థం చేసుకోవచ్చు.చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. అయితే కాలక్రమం లో ఆర్కామ్ దివాలా తీసింది. దీంతో రుణం ఇచ్చిన చైనా బ్యాంకులు ఇప్పుడు తమ రుణం పూర్తిగా చెల్లించాలని కోర్టుకు ఎక్కాయి.

దీన్ని చెల్లించడం లో విఫలమవడంతో అనిల్ అంబానీ కోర్టుకు హాజరయ్యాడు. తమకు రావాల్సిన 68 కోట్ల డాలర్ల బకాయిలు చెల్లించాలని కోరుతూ బ్యాంకులు లండన్లోని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించాయి. ఈ రుణానికి అనిల్ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని ఆయన ఆస్తుల విక్రయం ద్వారా బకాయిల రికవరీకి అవకాశం కల్పించాలని బ్యాంకు లు కోరాయి.అయితే దీనికి స్పందిస్తూ అనిల్ తరఫు న్యాయవాది తాను హామీ మాత్రం ఇవ్వలేదని చెప్పాడు. ‘‘తన పెట్టుబడుల విలువ పూర్తిగా పతనమైంది. గ్రూపు కంపెనీల్లోని తన ఈక్విటీ వాటా విలువ దాదాపు 8.24 కోట్ల డాలర్లకు క్షీణించింది. తాను చెల్లించాల్సిన అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడాయన ఆస్తి సున్నా. అప్పట్లో శ్రీమంతుడే కానీ ఇప్పుడాయన దగ్గరేం లేదు’’ అని అనిల్ తరఫు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు విన్నవించారు. దీంతో అతడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు చెప్పాడు.

అంబానీ వాదనలను బ్యాంకుల తరఫు న్యాయవాది కౌన్సిల్ ప్రశ్నించి రుణం ఎలాగైన చెల్లించాలని కోరింది. ఈ సందర్భంగా అనిల్ విలాస జీవనంపై ప్రస్తావించింది. అనిల్ కు  11 లగ్జరీ కార్లు సొంత నౌక ప్రైవేట్ జెట్ తో పాటు దక్షిణ ముంబైలో సీవిండ్ పెంట్ హౌజ్ కూడా ఉందని తెలిసింది. ఈ కేసులో అనిల్ తరఫు కౌన్సిల్ వాదనలతో సంతృప్తి చెందని కోర్టు.. ధర్మాసనం ఆరు వారాల్లో 10 కోట్ల డాలర్లు డిపాజిట్ చేయాలని అంబానీని ఆదేశించింది. మూలిగే నక్క నీడ తాటికాయ పడ్డ చందంగా అనీల్ అంబానీ పరిస్థితి తయారైంది . అనిల్ అంబానీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న నేపధ్యంలో అయినా ముకేష్ అంబానీ సాయమందిస్తాడా అన్నది వేచి చూడాలి .

RCom loan default case,anil ambani, mukhesh ambani , reliance communications , china banks , london , international court,Anil Ambani at London court

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article