ఆ ర్యాలీకి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదంటే…

REASON BEHIND KCR NOT ATTENDED MAMATHA’S RALLY

కారణం వెల్లడించిన ఎంపీ కవిత

కోల్ కత్తాలో మమతా బెనర్జీ నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి మరీ ఆహ్వానించినప్పటికీ సీఎం కేసీఆర్ ర్యాలీకి రాలేనని తేల్చి చెప్పేశారు. అయితే కోల్ కత్తాలో జరిగిన ఈ ర్యాలీకి చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించిన కారణంగానే సీఎం కేసీఆర్ ర్యాలీకి వెళ్లలేదని ఒక వాదన వినిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ర్యాలీ లో భాగస్వామ్యం తీసుకున్నందున కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకోలేదని సీఎం కేసీఆర్ ర్యాలీలో పాల్గొన్న లేదని మరొక వాదన వినిపిస్తుంది. కోల్ కత్తాలో నిర్వహించిన ర్యాలీకి తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు హాజరు కాకపోవడానికి గల కారణాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇంకో కొత్త విషయాన్ని చెప్పారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందు వల్లనే కేసీఆర్ ఆ ర్యాలీకి హాజరు కాలేదని కవిత చెప్పారు.

తెలంగాణ జాగృతి నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు సందర్భంగా మాట్లాడిన కవితశానససభ సమావేశాలు తమ పార్టీకి అత్యంత ప్రధానమైనవని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లతో సంబంధం లేకుండా అటువంటి ర్యాలీల్లో భవిష్యత్తులో తమ పార్టీ పాల్గొంటుందని ఆమె చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులను చూస్తే వారు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెసు, బీజేపీలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందువల్ల కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించారని ఆమె చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పటికీ సరైన నిర్ణయం జరగలేదని, అయితే ఎన్నికలకు ముందు పొత్తులు కచ్చితంగా ప్రధానమైన పాత్ర పోషిస్తాయని, ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తులు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొనసాగాలని ఆమె అన్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బీజేపీయేతర శక్తులు అందరిని ఏకం చేయడానికి నిర్వహించిన ర్యాలీలో పాల్గొనకపోవడానికి కారణం శాసనసభ సమావేశాలు అని ఎంపీ కవిత ఇంకో కొత్త విషయాన్ని బహిర్గతం చేశారు.

TRS PARTY UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article