రాజధాని కోసమే ఢిల్లీ వెళ్ళా .. భయపడేది లేదు

119
Reason Behind Pawan Delhi Tour
Reason Behind Pawan Delhi Tour

Reason Behind Pawan Delhi Tourఢిల్లీ నుండి నేరుగా కాకినాడ వెళ్ళిన పవన్ తాను ఢిల్లీ వెళ్ళిన కారణం చెప్పారు. ఏపీలో మూడు రాజధానులు ఎవరూ కోరుకోవటం లేదని అందుకే తను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడానని చెప్పారు పవన్ .ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన తన ఢిల్లీ పర్యటన గురించి పవన్ మాట్లాడారు. తాను ఢిల్లీకి వెళ్లింది ఎందుకు, వారితో ఏం మాట్లాడాను అనే వివరాలు చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఏపీలో పరిస్థితులను వివరించానని చెప్పారు. రాజధాని సమస్యను, అమరావతి రైతుల బాధలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని పవన్ తెలిపారు. ఏపీకి బలమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రం పెద్దలను కోరానన్నారు. ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని తరలింపుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. కాకినాడ వెళ్లిన పవన్.. ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడిలో గాయపడిన జనసేన నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ఎమ్మెల్యే ద్వారంపూడి, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము అని చెప్పారు. కాకినాడ ఘటన ఆఖరిది కావాలన్న పవన్.. ఇంకొక్క ఘటన జరిగితే.. తిరగబడతామని వార్నింగ్ ఇచ్చారు. తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్.. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here