అల్లు అర్జున్ పై సుకుమార్ గుస్సా ..

Reason Behind Sukumar Irritating

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ప్రస్తుతం అల వైకుంఠపురములో హ్యాంగోవర్ లో ఉన్నాడు. సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ అని అనేక పోస్టర్లు వేసిన తర్వాత కూడా మనోడు అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. త్రివిక్రమ్ డైరక్షన్ లో సంక్రాంతి బరిలో నిలిచిన అల వైకుంఠపురములో కలెక్షన్స్ పరంగా భారీ వసూళ్లు సాధించినా.. ఎందుకో ఇది ఇండస్ట్రీ హిట్ అంటే ఆడియన్స్ అంత సులువుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సాధారణ కంటెంట్.. అది కూడా ఓ పాత సినిమా నుంచి లేపేసిన పాయింట్.. దీనికే ఇంత హడావిడీ ఎందుకు అనేది వారి వెర్షన్.. మొత్తంగా అల్లు అర్జున్ ను వదలని ఈ హ్యాంగోవర్ ఇప్పుడు సుకుమార్ కు చిరాకు తెప్పిస్తోందట.

అల మూవీ తర్వాత బన్నీ అండ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది కదా. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా.. చెప్పిన టైమ్ కు అటెండ్ కావడం లేదు బన్నీ. అంటే అసలు షూటింగ్ కే వెళ్లడం లేదట. ఇప్పటికే రెండేళ్లుగా ఖాళీగా ఉంటోన్న సుకుమార్ ఈ సినిమాను కాస్త వేగంగా పూర్తి చేయాలనే నిర్ణయంతో ఉన్నాడు. కానీ అందుకు అల్లు అర్జున్ పెద్దగా సహకరించడం లేదనేది ఇన్ సైడ్ టాక్. ఒకవేళ సెట్స్ కు వచ్చినా.. పూర్తిగా అల వైకుంఠపురములో సినిమా గురించి.. షూటింగ్ టైమ్ లో జరిగిన సంఘటనల గురించి, త్రివిక్రమ్ టాలెంట్ గురించి సుకుమార్ వద్ద ఓ రేంజ్ లో ప్రస్తావిస్తూ అతన్నీ ఇబ్బంది పెడుతున్నట్టు భోగట్టా. దీంతో అటు షూటింగ్ మొదలుపెట్టక.. ఇటు ఈ సుత్తీ భరించలేక.. సుకుమార్ తన వాళ్ల వద్ద అసహనం వెళ్లగక్కుతున్నాడట. మరి ఇందులో నిజానిజాలెన్ని అనేది అప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కానీ రాకరాక వచ్చాడని అల్లుడిపై అటుకులు బోర్లించినట్టు.. రాకరాక వచ్చిన బ్లాక్ బస్టర్ గురించి అల్లు అర్జున్ మరీ ఈ రేంజ్ లో డబ్బాలు కొట్టడం కూడా బాలేదనే చెప్పాలి.

#Reason Behind Sukumar Irritating,#Sukumar,#Allu Arjun,#AlaVaikuntapuramloo

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article