భూదందాల కోసమే విశాఖకు రాజధాని…

111
Reason Behind Vishaka Turns Capital
Reason Behind Vishaka Turns Capital

Reason Behind Vishaka Turns Capital

ఏపీ మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ప్రజా వ్యతిరేకమని బీజేపీ మండిపడుతుంది.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమే రాజధాని మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఎన్నికల ముందు ఏం చెప్పారు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమేనన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పడిన బాధలను ఇప్పుడు ప్రజలపై రుద్దుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. విశాఖలో భూ దందా కోసమే రాజధానిని మార్చారని ఆరోపించారు. త్వరలో జనసేనతో కలిసి రాజధాని మార్పుపై ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. స్వార్థప్రయోజనాలకు వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందన్న ఎంపీ జీవీఎల్‌  అమరావతిలో అసెంబ్లీ ఒక్కటే ఉంటే రాజధాని అంటారా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం రైతుల పక్షాన పోరాటం సాగిస్తామని చెప్పారు .

Reason Behind Vishaka Turns Capital,cm jagan mohan reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here