హరీష్ , కవిత రాజీనామాల వెనుక రీజన్ ఏంటో ?

Reason Beshind Harish rao and Kaivtha Resignation

టిఆర్ఎస్ పార్టీ లో రాజీనామాల పర్వం హాట్ టాపిక్ గా మారింది . తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు గౌరవాధ్యక్షుడిగా రాజీనామా చేయగా, ఇప్పుడు ఎంపీ కవిత సైతం వివిధ సంఘాల గౌరవాధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమయం కేటాయించలేక రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ కవిత ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం వివిధ సంఘాలకు గౌరవాధ్యక్ష హోదాలో ముందుండి నడిపించిన టిఆర్ఎస్ నాయకులు సడన్ గా రాజీనామా చేయడం వెనుక కారణాలేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పలు సంఘాల అధ్యక్ష పదవులకు ఎంపీ కవిత రాజీనామా చేశారు. రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘం, విద్యుత్ కార్మిక సంఘం, అంగన్‌వాడీ టీచర్స్ , హెల్పర్స్ అసోసియేషన్, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులకు తన రాజీనామా లేఖలను అందజేశారు. కార్మికుల సేవలో సంతృప్తి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పనిభారం దృష్ట్యా తన సేవలను అందించలేక పోతున్నానని కవిత అన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గానికి మరింత సమయం కేటాయించవల్సి ఉన్నందున సంఘాల గౌరవ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కార్మికలోక సంక్షేమానికి అందుబాటులో ఉంటానని కవిత తెలిపారు.మొత్తానికి వివిధ సంఘాల బాధ్యతలు నిర్వర్తించే తీరిక లేదని చెప్తున్నా అసలు విషయం అది కాదని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article