దేవినేని అవినాష్ ఎందుకు వైసీపీలోకి జంప్?

REASONS FOR DEVINENI AVINASH JUMPS YSRCP

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీకి  షాక్ ఇచ్చి వైసీపీలో  చేరారు. టీడీపీకి రాజీనామా  చేసిన ఆయన అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చంద్రబాబు ఒక వైపు విజయవాడలో దీక్ష చేస్తున్న సమయం లోనే అవినాశ్ ను ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన అవినాశ్ తనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో కొందరికే ప్రాధాన్యత లభిస్తోందని కొద్ది రోజులుగా ఆవేదనతో ఉన్నారు. తన తండ్రి అనుచరులు..తన సన్నిహితులతో ఇదే అంశం మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమయంలోనే వైసీపీ నుండి ఆహ్వానం ఉండటంతో..వారి అభిప్రాయాలు సేకరించారు. వారంతా వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో..అవినాశ్ వైసీపీలో చేరాలని నిర్ణయించారు. అవినాశ్ కు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించే విధంగా వైసీపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి జగన్ ఆయనతో పాటుగా పార్టీలో చేరేందుకు వచ్చిన కడియాల బుచ్చిబాబు వంటి వారికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. తొలుత తండ్రితో కలిసి కాంగ్రెస్లో.. ఆ తరువాత టీడీపీలో విజయవాడ నగరంలో అవినాశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

తండ్రి దేవినేని నెహ్రూ మరణం తరువాత ఆయన టీడీపీలో మరింత యాక్టివ్ అయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సూచన మేరకు అవినాష్ గుడివాడ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే, కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల కారణంగా..అవినాశ్ ఆవేదనతో ఉన్నారని సహచరులు చెబుతున్నారు. దీంతో పాటుగా.. పార్టీలో ప్రాధాన్యత.. గుర్తింపు లేని కారణంగా ఇక పార్టీ వీడాలని అవినాశ్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.  నిర్ణయం తీసుకున్నదే తడవుగా ఆయన వైసీపీలో చేరి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు .

tags : devineni avinash, ycp, tdp, chandrababu, ys jagan, andhrapradesh, vijayawada

కోర్టుపైనే కార్మికుల చివరి ఆశ

పురుగులమందు తాగి మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *