ఎలిమినేషన్ ప్రక్రియలోకి ఈటెల?

111
Will Eetala Eliminated By Trs?
Will Eetala Eliminated By Trs?

కేటీఆర్ కు లైన్ క్లియర్ చేయడానికేనా?

మనలో చాలామంది బిగ్ బాస్ ప్రోగ్రాం చూసే ఉంటారు కదా.. గత నాలుగు సీజన్లు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ కార్యక్రమాన్ని చూసేవారికి ‘ఎలిమినేషన్’ ప్రక్రియ ఇట్టే అర్థమవుతుంది. ఒక కంటెస్టెంట్ గేమ్ బాగా ఆడుతున్నాడంటే.. కొందరు కలిసి అతన్ని ఎలిమినేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ బిగ్ బాస్ కంటే ఎంతో రసవత్తరంగా గేమ్ జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. మరొక వ్యక్తిని ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియకు తీసుకొచ్చారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్షుణ్నంగా గమనిస్తే.. ఈ పార్టీలో మొదట్నుంచి ఉన్నవారిలో రాములు నాయక్ ఆరంభంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత నాయినీ నర్సింహారెడ్డి అనారోగ్య కారణాలతో మరణించగా.. మాజీ స్పీకర్ మధుసూదనా ఛారీ ఎన్నికలో ఓడిపోయి ఓ మూల కూర్చున్నారు. ఆరంభం నుంచి పార్టీని భుజస్కంధాల మీద మోసినవారిలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముందంజలో ఉంటారు. పైగా, వారికి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అయితే, కేసీఆర్ తర్వాత తదుపరి సీఎం ఎవరు? అనే మాట చాలాసార్లు వినిపించింది. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.

  • టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే నెంబర్ టూ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో మేనల్లుడి మీద ఎక్కడ్లేని ప్రేమ ప్రదర్శించేవారు. కాకపోతే, హరీష్ రావు ఎవరు? అతను కేసీఆర్ తరఫున మనిషి. అంటే బయటి వ్యక్తి అన్నమాట. కానీ, రాజ్యాధికారం బయటి వ్యక్తికి కాకుండా ఇంటి మనుష్యులకే ఉండాలి కదా? హరీష్ రావు పార్టీలో నెంబర్ టూ అవుతున్న క్రమంలో.. కేటీఆర్, కవితలను టీఆర్ఎస్ లోకి బలవంతంగా తీసుకొచ్చారు. వారు తొలుత అయిష్టంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్న కిక్కు అర్థమయ్యాక పూర్తిగా ఇన్ వాల్వ్ అయ్యారు. ఇద్దరూ స్వతహాగానే తెలివితేటలు గలవారు కావడంతో చాలా కష్టపడ్డారు. పైగా, బిగ్ బాస్ పిల్లలు. ఇంకేంముంది.. పార్టీలో ఒక స్థాయికి చేరుకున్నారు. సరిగ్గా ఇక్కడే.. ఇంటిపోరు, బయటిపోరు మధ్య వైరం తారా స్థాయికి చేరింది.
  • సీఎం కేసీఆర్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి హరీష్ రావు. అతన్ని క్రమక్రమంగా బిగ్ బాస్ షో తరహాలో నెమ్మదిగా లైన్ క్లియర్ చేసి ఎలిమినేట్ చేశారు. అంటే, పేరుకే హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కానీ అతని శాఖలో పని చేసే అధికారులంతా ప్రగతి భవన్ మాటే వింటారనేది బహిరంగ రహస్యం. ఇక, ఆ తర్వాతి మాస్ లీడర్ ఎవరంటే.. ప్రధానంగా వినిపించేది ఈటెల రాజేందర్ మాట. ఆయనకు ముందునుంచీ నిఖార్సయిన, నీతినిజాయితీగా నాయకుడు అనే పేరుంది. టీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టే నాటికే తను ఓ స్థాయి పారిశ్రామికవేత్త. హరీష్ రావు తర్వాత అంతే ఛరిష్మా గల నాయకుడు కాబట్టి అతనిపై ఫోకస్ చేశారు.
  • అసలు ప్రగతి భవన్ లో చక్రం తిప్పేదెవరు? కేటీఆర్, కవితలను అకస్మాత్తుగా పిలిపించింది ఎవరు? ఎమ్మల్యేగా, ఎంపీగా పోటీ చేయించింది ఎవరు అంటే, కేసీఆర్ సతీమణి ఈ ప్రణాళిక రచించారని తెలిసిందే. పైగా, ఆమెకు సంతోష్ కుమార్ స్వయాన సోదరి కొడుకు కావడం వల్ల తనకు ఎంపీ సీటును ఇప్పించారనేది బహిరంగ రహస్యం. మరోవైపు, కేసీఆర్ తరఫున బంధువుల్లో అధిక శాతం మందిని వీరంతా ఎప్పుడో ఎలిమినేట్ చేశారు. ఆ క్రమంలో హరీష్ రావు ఎలిమినేట్ అయిపోయాడు. ఇక కేటీఆర్ సీఎం అయ్యేందుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. తాజాగా, మరో కీలక వ్యక్తి అయిన ఈటెల రాజేందర్ ను ఎలిమినేషన్ ప్రక్రియకు తీసుకొచ్చారు. మరి, ప్రభుత్వం ఈటెలను ఈ గేములో ఎలిమినేట్ చేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here