ప్ర‌వీణ్ కుమార్ రాజీనామాకు కార‌ణం?

తొమ్మిదేళ్ల నుంచి గురుకుల పాఠ‌శాల‌లో అనేక విప్ల‌వాత్మ‌క మార్పుల్ని తెచ్చిన ఘ‌న‌త ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కే ద‌క్కుతుంది. ప్ర‌భుత్వ గురుకుల పాఠ‌శాల్ని అత్య‌ద్భుతంగా తీర్చిదిద్దిన ఆయ‌న హ‌ఠాత్తుగా ఎందుకు రిజైన్ చేశారు? ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. గురుకులాల్లోకి స్థానిక రాజ‌కీయాల్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని తెలిసింది. ఎందుకంటే, గురుకులాల్లో యాభై శాతం సీట్ల‌ను స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి కేటాయించే విధంగా జీవోను తెచ్చారు. దీంతో, ఆయ‌న‌కు స్వేచ్ఛ లేకుండా అవుతుంది. స్థానిక రాజ‌కీయాలు అందులోకి ప్ర‌వేశిస్తే గురుకుల వ్య‌వ‌స్థ నాశ‌న‌మ‌వుతుంద‌ని అర్థ‌మైంది. అందుకే, ఆయ‌న స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశార‌ని తెలిసింది. కాక‌పోతే ఆయ‌న రాజ‌కీయాల్లో వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు ప్ర‌వాసుల నుంచి సంపూర్ణ మ‌ద్ధ‌తు ఉంది. మ‌రి, రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న స్ట్రాట‌జీ ఎలా ఉంటుందో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article