టీఆర్ఎస్ ఆధిపత్యానికి తెర?

45
Reasons for Trs Failure In Ghmc
Reasons for Trs Failure In Ghmc

Reasons for Trs Failure In Ghmc

ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిపత్యానికి భారీ గండి పడుతుందా? టీఆర్ఎస్ కోటకు బీటలు వారుతోందా? అధికార పార్టీకి ఎదురు గాలి వీస్తోందా? దీనికి వరదలతో పాటు వరుస తప్పిదాలే కారణమా? ప్రస్తుతం మారిన పరిస్థితుల్ని చూస్తే ఔననే అనిపిస్తోంది. 2016లో గెలిచినట్లుగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా కనిపించడం లేదు. హైదరాబాద్లో నిలబడాలంటే ముళ్లబాటను దాటాల్సిందే. మజ్లిస్ సాయంతో మేయర్ సీటును తెరాస గెలవొచ్చు గాక కాకపోతే బీజేపీతో హోరాహోరీ తప్పేలా కనిపించడం లేదు. 

ఎందుకంటే మానవాళి ఎదుర్కొన్న అత్యంత సంక్లిష్ట సమస్య అయిన కరోనా సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజలకు ఆగ్రహానికి గురి చేసింది. ఆ సమయంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల గొంతు నొక్కిన విషయాన్ని ప్రజలంతా లైవ్ లో చూశారు. ప్రజలు పడుతోన్న బాధలను పట్టించుకోకుండా కేవలం ప్రగతి భవన్ కే పరిమితం కావడం, మెడికల్ విభాగాన్ని పటిష్ఠం చేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కరోనా దానంతట అదే తగ్గింది తప్ప, ప్రభుత్వం నిర్దిష్ఠమైన చర్యలు తీసుకోలేదని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. పైగా ఈ రోగాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో పేదలు విలవిలలాడిపోయారు. తమ వద్ద ఉన్న సొమ్మంతా ఈ రోగం నయం చేయడానికే వెచ్చించారు. ప్రభుత్వం తమను ఆదుకోలేదనే కోపం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. లాక్ డౌన్ సమయంలో ప్రజల ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకుండా రహదారులను అభివ్రుద్ధి చేశారు. ఒకవైపు ప్రజలు కరోనాతో చనిపోతుంటే పట్టించుకోకుండా రోడ్లకు మరమ్మత్తులు చేశారు. పొరుగు రాష్ట్రమేమో కరోనాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే.. తెలంగాణలో యశోధాశ్రీలో చేర్చారని ప్రజలు విమర్శిస్తున్నారు.

* కరోనా వస్తే ఎలా బతకాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రజలు ఉండగా.. బతుకు సమరం ఎలా కొనసాగించాలా అని మలమల మాడిపోతుంటే హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజల మీద అధికార పార్టీ పిడుగు వేసింది. ఎల్ఆర్ఎస్, ధరణి పేరిట చావుదెబ్బ తీశారు. ఎల్ఆర్ఎస్ పేరిట నాలుగు రెట్లు అధికంగా సొమ్ము వసూలు చేశారు. ఓపెన్ స్పేస్ వదలకుండా లేఅవుట్లను వేసిన రియల్టర్లను వదిలేసి అమాయక ప్రజల నుంచి పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలంటూ ముక్కుపిండి సొమ్ము వసూలు చేశారు. పైగా, దీని మీద ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఫలితంగా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో, వీరంతా అధికార పార్టీకి వ్యతిరేకమయ్యారు.

* ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రెండు నెలల పాటు రియల్ రంగం దారుణంగా దెబ్బతిన్నది. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో కొందరి పెళ్లిళ్లు నిలిచిపోయాయి. మరికొందరు సకాలంలో సొమ్ము అందక చికిత్స లభించక కరోనా వల్ల దుర్మరణం చెందారు. దీనికంతటికీ కారణం.. అవసరానికి ప్లాట్లు అమ్ముకునే పరిస్థితి లేకపోవడమే. ప్రస్తుతమున్న వ్యవస్థను నిలిపివేసి.. కొత్త వ్యవస్థను డెవలప్ చేయమని ఎవరన్నారు? అలా ఎవరైనా చేస్తారా? తెలివి ఉన్న ఏ ప్రభుత్వమైనా అలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అంటూ సామాన్య రియల్టర్లు సైతం నిలదీస్తున్నారు. అందరికీ ప్రస్తుతం ప్రత్యామ్నాయం బీజేపీయే కనిపిస్తుంది కాబట్టి, వారికే ఓట్లేసి గెలిపిస్తామని అంటున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమితో బీజేపీకి సరికొత్త ఉత్సాహం లభించింది. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్లో చేరిపోతారు గనక.. బీజేపీకి ఓటేయడమే కరెక్టు అని ప్రజలంతా అనుకుంటున్నారని సమాచారం. ఈ ఒక్కసారి బీజేపీకి ఛాన్సు ఇచ్చి చూడాలని భావిస్తున్నారు.

GHMC ELECTIONS 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here