గులాబీ పార్టీలో రెబల్స్ గా బరిలోకి దిగితే చర్యలేనా?

121
Rebel Trouble For TRS In Muncipal Polls
Rebel Trouble For TRS In Muncipal Polls

Rebel Trouble For TRS In Muncipal Polls

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మిగతా రాజకీయ పార్టీల కంటే టీఆర్ ఎస్ పార్టీకే తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ ఎస్ పార్టీలో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. టీఆర్ ఎస్ పార్టీ కోసం మొదతనుంది పని చేసినవారు , ఆ తర్వాత వివిధ పార్టీల నుండి వచ్చిన నేతలతో పాత కొత్త నేతల మధ్య టికెట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఒక ఒకవైపు  నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది… ఓవైపు అభ్యర్థులు తాము పోటీ చేసే స్థానాల్లో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోటీచేయడానికి ఉత్సాహం చూపించే అందరికీ సీట్లను కేటాయించలేని పరిస్థితి పార్టీలో నెలకొంది. దీంతో.. కొన్ని స్థానాల్లో రెబల్స్ బెడద తప్పడంలేదు. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువగా ఉంది. కొందరు బీఫామ్‌లు అందుకుని పోటీకి దిగితే.. మరికొందరు రెబల్స్‌గా బరిలోకి దిగి తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటామంటున్నారు. అయితే, రెబల్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది టీఆర్ఎస్… రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లకు అప్పగించింది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బుజ్జగించి వెనక్కి తగ్గితే సరి లేకపోతే వారి పేర్లు, వివరాలను పార్టీ అధిష్టానానికి పంపాలని ఆదేశించింది. దీంతో, రెబల్స్‌పై టీఆర్ఎస్‌ అధిష్టానం గుర్రుగా ఉందని.. అవసరమైతే చర్యలకు కూడా వెనుకాడదనే ప్రచారం జరుగుతోంది.

Rebel Trouble For TRS In Muncipal Polls,municipal elections, cm kcr, telangana bhavan , trs party , rebals, high command , nominations

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here