కరోనాను ఎదిరించి.. క్యాన్సర్​ను జయించాడు


– యువకుడికి ప్రాణదానం చేసిన కిమ్స్​ ఆస్పత్రి డాక్టర్లు
– సంక్లిష్ట పరిస్థితుల్లో ఎముక మజ్జ మార్పిడి


క్యాన్సర్​ అంటేనే సాధారణంగా ప్రాణాలమీద ఆశలు వదిలేసుకుంటారు. అటువంటి క్యాన్సర్​ మహమ్మారికి చికిత్స పొందుతున్న దశలో కరోనా దాడి చేసి ప్రాణాలు పోయేవరకు వెళ్లినా.. కిమ్స్​ డాక్టర్ల సంక్లిష్టమైన చికిత్సకు తోడు తన ఆత్మస్థైర్యంతో రెండు మహమ్మారులను జయించాడు.. ఓ 24 ఏళ్ల యువకుడు. ఈ అరుదైన ఘటన కిమ్స్​ ఆస్పత్రి సికింద్రాబాద్​లో జరిగింది.

అరుదైన రక్త క్యాన్సర్​ ( అక్యూట్​ మైలాయిడ్​ లుకేమియా) తో బాధపడుతున్నయువకుడికి కిమ్స్‌ ఆస్పత్రి సీనియర్​ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, హెమటో-అంకాలజిస్ట్ అండ్ స్టెమ్ సెల్ / బోన్ మజ్జ మార్పిడి నిపుణులు డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ తోట ఆధ్వర్యంలో ఈ అరుదైన బోన్​ మారో ట్రాన్స్​ప్లాంటేషన్​) బీఎంటీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా కిమ్స్‌ ఆస్పత్రి సీనియర్​ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, హెమటో-అంకాలజిస్ట్ అండ్ స్టెమ్ సెల్ / బోన్ మజ్జ మార్పిడి నిపుణులు డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ తోట పేషెంట్​కు చికిత్సనందించే సమయంలో ఎదురైన అవరోధాలు, చికిత్స నందించిన తీరును వివరించారు.

‘‘మంచిర్యాల జిల్లాకు చెందిన రాజ్​కుమార్​ కొచ్చర్ల (24) అనే యువకుడు గతేడాది జూన్​లో క్యాన్సర్​ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చాడు. యువకుడికి పలు పరీక్షల అనంతరం అరుదైన బ్లడ్​ క్యాన్సర్ ( అక్యూట్​ మైలాయిడ్​ లుకేమియా) ​తో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. క్యాన్సర్​ నియంత్రణ చికిత్సలో భాగంగా అతడు కీమోథెరపీ చేయించుకుంటున్న దశలో కరోనా బారిన పడ్డాడు. సాధారణంగానే క్యాన్సర్​ పేషెంట్లలో ఇమ్యూనిటీ లెవల్స్​ చాలా తక్కువగా ఉండటంతో కొవిడ్​ విజృంభణతో బతికే అవకాశాలు లేవనకున్న దశ నుంచి చాలా రోజులు వెంటిలేటర్​ పైనే చికిత్స పొంది బతికి బయటపడ్డాడు. అతడు అంతటి కఠినమైన పరిస్థితుల నుంచి బతకడం డాక్టర్లు, వైద్య సిబ్బంది ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ”అని వివరించారు.

‘‘అదృష్టవశాత్తు అతడు కొవిడ్​ బారి నుంచి బయట పడి క్రమంగా పలు జాగ్రత్తలు పాటిస్తూ సాధారణ స్థితికి చేరాడు. అనంతరం క్యాన్సర్​కు కీమో థెరపీలు చేయించుకోవడం ద్వారా క్రమంగా లుకేమియా కు చేసే సర్జరీకి సహకరించేలా తయారయ్యాడు. అయితే లుకేమియాకు ఎముకమజ్జ మార్పిడి అనేది సరైన చికిత్స కావడంతో అతడి మేనమామ మజ్జ 50 శాతం మ్యాచ్​ కావడంతో గత ఫిబ్రవరి నెలలో ఎముక మజ్జ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశాం. అనంతరం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించాం. దాదాపు 4 నెలల పర్యక్షణ అనంతరం ఇప్పుడు రాజ్​కుమార్​ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తయారయ్యాడు. ఈ రకమైన సంక్లిష్టమైన సమస్యలకు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చినా సరైన డోనర్​ దొరికితే ఎముక మజ్జ మార్పిడియే సరియైన చికిత్స అని డాక్టర్​ నరేందర్​ కుమార్​ తోట వివరించారు. ముఖ్యంగా ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స నందిస్తే ప్రాణాలు కాపాడటం కష్టమేమీ కాదు. ”అని ఆయన పేర్కొన్నారు.

ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియనే ‘స్టెమ్​ సెల్​ ట్రాన్స్​ప్లాంట్’​ అని కూడా పిలుస్తారు. ఈ ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలో నిష్క్రియమైన ఎముక మూల కణాలు కలిగిన వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఎముక మూల కణాల్ని మార్పిడి చేస్తారు. ఎముక మజ్జ అనేది ప్రతి ఎముక లోపల ఉన్న ఒక మెత్తటి కణజాలం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు ఉత్పత్తికి అవసరమైన స్టెమ్​ కణాలు ఈ ఎముక మజ్జలోని భాగమే.

అనంతరం రాజ్​కుమార్​ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అరుదైన క్యాన్సర్​, కొవిడ్​ దాడితో బతకడం చాలా కష్టం అనుకుని ఆశలు వదిలేసుకున్న తమ కుమారుడిని బతికించిన కిమ్స్​ ఆస్పత్రి యాజమాన్యానికి, డాక్టర్ల బృందానికి, వైద్యసహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article