భారీ కెమెరాతో రెడ్ మీ నోట్-7

REDMI NOTE 7 FEATURES

  • మూడు వేరియంట్లలో కొత్త ఫోన్ విడుదల

చైనా మొబైల్ దిగ్గజం షావోమీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రెడ్ మీ నోట్ సిరీస్ లో రెడ్ మీ నోట్-7ని విడుదల చేసింది. భారీ కెమెరా ఈ ఫోన్ సొంతం కావడం విశేషం. ఏకంగా 48 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన డ్యూయర్ రియర్ కెమెరాను ఇందులో ఏర్పాటు చేశారు. అంతేకాదు సరికొత్త డిజైన్, డ్యూడ్రాప్‌ నాచ్ తో రూపొందించిన షావోమి తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ధర దాదాపు రూ.10వేలు కాగా,4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ధర రూ.12,500గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,500గా నిర్దారించారు. ఫిబ్రవరిలో జరిగే చైనీస్ కొత్త సంవత్సరం ప్రారంభ తర్వాత చైనా మార్కెట్ లో ఈ పోన్ లభిస్తుంది.

రెడ్ మీ నోట్-7 ఫీచర్లు ఇవీ…
6.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
2340×1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌ 660
48+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article