ఆదివారం రిజిస్ట్రేషన్లు ఓపెన్

registrations open on sunday

తెలంగాణ ప్రభుత్వం గురువారం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నది. మార్చిలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్ని ఆదివారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు తెలియజేశారు. రెండవ శనివారం (మార్చి 13th ) లో కూడా పని చేసేందుకు తెరిచి వుంచాలని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలు మార్చిలో మహాశివరాత్రి (మార్చి 11th) మరియు హోళి (మార్చి 29th) రోజులలో తప్ప మిగత అన్ని రోజులలో తెరిచివుంటాయి.

రిజిస్ట్రేషన్ లకు గల డిమాండ్ మరియు ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి, 2021 మాసంలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపారు. ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమీషనర్ మరియు IG శ్రీ శేషాద్రి , అసోసియేషన్ ప్రెసిడెంట్ స్ధిత ప్రజ్ఞ, కన్వీనర్ మరియు టిఎన్జిఓ హైదరాబాద్ నగర అద్యక్షుడు ముజిబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు  ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Stamps and Registrations

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article