మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ సినిమాలకి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ రావొచ్చని కొంతకాలంగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తూ వచ్చింది.ఆ ప్రచారం నిజమే అయ్యింది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న `ప్రాజెక్ట్ కె` విడుదల ఖరారయ్యింది.వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది.ఓ పెద్ద హ్యాండ్ బొమ్మ కనిపిస్తుండగా, దాన్ని కమెండోలు షూట్ చేస్తున్న లుక్ అది.టైమ్ మిషన్ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.ఈ సినిమా కోసం ప్రతిదీ కొత్తగా తయారు చేసుకోవల్సి వస్తోందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకు తెలియజేశారు.
దీన్నిబట్టి ఈ సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా యూనిక్‌గా ఉంటుందని స్పష్టమవుతోంది.పాన్ వరల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందుతోందని సినీ వర్గాలు తెలిపాయి.వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటిస్తోంది.అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈసినిమాని రెండు భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపుగా మరో పార్ట్ కూడా ఉండొచ్చని సమాచారం.