చంద్రబాబుకి ఎన్‌ఎస్‌జీ భద్రత కట్ ..

Removed NSG commandos For Chandrababu

దేశంలో బీజేపీ  ప్రభుత్వం రెండోదఫా అధికారాన్ని చేపట్టిన తరువాత  ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా భద్రత విషయంలో కూడా దేశవ్యాప్తంగా 350 మంది వీఐపీలకు భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీ ఫ్యామిలీకి ఎస్పిజి  భద్రతను తొలగించారు.ఇక మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులకు సైతం భద్రత తగ్గించి షాక్ ఇచ్చింది ఎన్డీయే సర్కార్ . ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చింది కేంద్రం . ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణ వలయంలా కనిపించే బ్లాక్ క్యాట్ కమాండోలను తొలగించాలని బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది . ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు, చంద్రబాబు సహా దేశం మొత్తం మీద 13 మంది ప్రముఖులకు కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇక జాబితాలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో పాటు రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్, శర్వానంద సోనోవాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులున్నారు. ఇకపై వీరందరి సెక్యూరిటీని పారా మిలిటరీ దళాలు చూస్తాయని స్పష్టం చేసింది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు , కేంద్ర మంత్రులకు ఎవరికైతే ఎన్‌ఎస్‌జీ భద్రత ఉందో వారికి సైతం భద్రత తొలగించబడుతుంది. అలాగే గడచిన 20 సంవత్సరాలుగా బ్లాక్ క్యాట్ కమాండోలుగా  చెప్పబడే ఎన్ఎస్జీ బృందాలు, వీఐపీల భద్రతను చూస్తున్నాయి. ముఖ్యంగా జడ్ ప్లస్ విభాగంలో ఉన్న వారందరి భద్రతనూ వీరు పర్యవేక్షిస్తున్నారు. ఇక వీరందరికీ ఒక్కొక్కరికీ 25 మంది బ్లాక్ క్యాట్ కమాండోల చొప్పున భద్రతను కేంద్రం  కల్పించింది. అయితే వీరి అసలు బాధ్యత అది కాదని, వీఐపీల రక్షణ వీరి పరిధిలోనిది కాదని  కేంద్ర హోం శాఖాధికారి ప్రకటించారు.

1984లో హైజాక్ ఆపరేషన్స్ కోసం ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. కానీ వారిని ఎక్కువగా వీఐపీల భద్రతకే  వినియోగిస్తున్నారు. అయితే తాజా నిర్ణయం వల్ల దాదాపు 450 మంది ఎన్ఎస్జీ కమాండోలు  వ్యక్తులకు కాకుండా దేశం కోసం తమ సేవలు అందించనున్నారు . ఇండియాలో ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున, వీరిని ఆయా ప్రదేశాలకు హుటాహుటిన తరలించడానికి అనువుగా, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది కేంద్రం.

Removed NSG commandos For Chandrababu,central government, National Security Guards , VIP security, removal , para milatary teams, chandrababu , raj nath singh, yogi adithyanath, mayavathi

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article