పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఆవేదన

140
Renu Desai fires on Pawan Kalyan over flat issue
Renu Desai fires on Pawan Kalyan over flat issue

Renu Desai fires on Pawan Kalyan over flat issue

పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లాడిన భార్య రేణూదేశాయ్. పవన్ కు ఇది రెండో పెళ్లే అయినా..  ఈ ఇద్దరి దాంపత్యాన్ని చూసి చాలామంది ముచ్చటపడేవారు.కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చాడు. అప్పటి నుంచి రేణు పూణెలో ఉంటోంది. కొన్నాళ్ల క్రితం తను కూడా మరో పెళ్లికి సిద్ధం అయింది. మరి ఏమైందో కానీ అది ఆగిపోయినట్టుంది. ఇక కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగానే కొత్త కొత్త పనుల్లో మునిగిపోతోన్న రేణుపై లేటెస్ట్ గా ఓ కొత్త రూమర్ హల్చల్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఆమెకు హైదరాబాద్ లో ఓ కాస్ట్ లీ ఇల్లు కొనిచ్చాడని.. అందులోనే తన పిల్లలను ఉంచి చూసుకోమని చెప్పాడని ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో రేణూదేశాయ్ హర్ట్ అయింది. తన మాజీ భర్త ఇప్పించాడని చెబుతోన్న ఇల్లు తనే సొంతంగా కొనుక్కున్నానని చెబుతూ ఫేస్ బుక్ లో ఓ ఆవేదానాత్మక వివరణ ఇచ్చింది.
తనలాంటి సింగిల్ పేరెంట్ కు మద్ధతు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ.. చేతికొచ్చింది రాయొద్దంటూ బాధపడింది. తనకు ఎవరూ ఇల్లు కొనివ్వలేదని.. తన సొంత డబ్బులతోనే కొనుక్కున్నాని క్లారిటీ ఇచ్చింది. అదే టైమ్ లో తనకు పవన్ కళ్యాణ్ నుంచి ‘అన్యాయంగా’ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తేల్చివేసింది. తన తండ్రి నుంచి కూడా డబ్బులు తీసుకోలేదని.. అంతా తన స్వార్జితమే అంటూ ఫీలయింది.

ఇలా మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఓ మహిళ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, అస్తిత్వం దెబ్బతింటాయని ఓపేద్ద పోస్ట్ నే రాసింది.
అయితే కొసమెరుపేంటంటే.. పవన్ కళ్యాణ్ తనక ఇల్లు కొనిచ్చాడని వస్తోన్న వార్తలు అతనికి కూడా తెలియకపోవచ్చు. ఆయన వరకూ ఈ వార్తలు వెళ్లి ఉండకపోవచ్చు అంటూ చెప్పింది రేణు. ఏదేమైనా కొన్ని వార్తల విషయంలో రేణూ పట్టించుకోలేదు. కానీ ఈ రూమర్ పై భారీగానే ఆవేదన పడిపోయింది. నిజమేంటనేది పై వాడికే తెలియాలి. కానీ కొన్నిసార్లు మీడియా నుంచి కూడా అత్యుత్సాహం పనికిరాదేమో.

Renu Desai fires on Pawan Kalyan over flat issue,#Pawankalyanwife,#Renudesai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here