గవర్నర్ కొడతారని రేవంత్ కు భయమట?

Revanth fears that the governor will hit 

తెలంగాణ గవర్నర్ నరసింహన్  ఆగస్టు 15 సందర్భంగా ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఈ  తేనీటి విందుకు టిఆర్ఎస్,  బిజెపి, కాంగ్రెస్,  టిడిపి  నాయకులు పెద్ద సంఖ్యలో  వచ్చారు, గవర్నర్ నరసింహన్ ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా పలకరించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించగా ఒక రేవంత్ రెడ్డి మాత్రం కెసిఆర్ కు దూరంగా ఉన్నారు.  ఇక కేసీఆర్ సైతం రేవంత్ ను  తప్ప  కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ  పలకరించారు. అదలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి  గవర్నర్ నరసింహన్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం  చోటు చేసుకుంది. కార్యక్రమానికి వచ్చిన అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా చేతులు కలిపిన గవర్నర్.. రేవంత్‌ను చూస్తూ  కరచాలనం చేయకుండా ఆగిపోయారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అది కాస్తా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.  ఇంతకి వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఏంటి అంటే..  రేవంత్ రెడ్డి ని చూడగానే గవర్నర్  వచ్చావా?   రాలేదేమోనని నీ కోసమే  చుట్టూ చూస్తున్నా  న్నారు.. దానికి సమాధానం గా రేవంత్ మీరు ఆహ్వానించగా రాకుండా ఉంటానా అని పేర్కొన్నారు.  దీంతో గవర్నర్ మరి నన్ను కలవడానికి వస్తానన్నారుగా ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు.  అప్పుడు రేవంత్  మీరు  కొడతారేమో అని భయమేసింది అని  అందుకే రాలేదని  సమాధానమిచ్చారు.  దాంతో వెంటనే గవర్నర్ గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ నేను కొట్టానా ?  మీరే నన్ను కొట్టారు అంటూ  వ్యాఖ్యానించారు.  వెంటనే అందుకున్న రేవంత్ అందుకే రాలేదు.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఎక్కడ కొడతారో అని భయమేసి రాలేదు  అంటూ  బదులిచ్చారు.  దీంతో మాటకు మాట సమాధానంగా  గవర్నర్, రేవంత్ రెడ్డి ల  సంభాషణ  విన్న  వారంతా  ఒక్కసారిగా నవ్వేశారు. ఇక రేవంత్  మాటలకు గవర్నర్ సతీమణి బదులిచ్చారు. షబ్బీర్ అలీ గవర్నర్ పలకరిస్తూ నాపై కోపంగా ఉన్నట్టున్నారే  అని అన్నారు.  ఇక ఈ మాటకు  కూడా రేవంత్ రెడ్డి  సమాధానంగా  మా షబ్బీర్  బిర్యానీ పెడతాడు తప్ప ఎవర్ని కోపగించుకోవడం అంటూ బదులిచ్చారు..  ఇక వెంటనే గవర్నర్ సతీమణి ఆయన బిర్యాని తినరు కదా అంటూ సమాధానం ఇవ్వడంతో  మరోమారు ఎట్ హోం కార్యక్రమంలో నవ్వుల పువ్వులు పూశాయట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *