కేసీఆర్ పై రేవంత్ తీవ్ర ఆరోపణలు

REVANTH FIRED ON KCR

  • అహంకారం తలకెక్కి ప్రత్యర్థులను వేధిస్తున్నారని ధ్వజం
  • ప్రాజెక్టు పనుల్లో హరీశ్ వెయ్యి కోట్లు వసూలు చేశారని ఆరోపణలు

సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ లో అసమర్థులకు చోటిస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, పాలన పక్కనపెట్టి, ప్రత్యర్థులను వేధిస్తున్నారని విమర్శించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఉగ్రదాడిలో అమరులైన జవాన్లుకు కేసీఆర్‌ నివాళులు అర్పించకపోవడం దారుణం. ఆయన దృష్టిలో జవాన్‌లకు, కిసాన్‌లకు విలువలేదు. నిజామాబాద్‌లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్‌ పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నా. వారంలోగా పరిష్కరించకుంటే నేనే ఆ రైతులకు మద్దతుగా వెళతా’ అని స్పష్టంచేశారు. తెలంగాణ కేబినెట్ లో హరీశ్ రావుకు చోటు దక్కదన్నారు.

‘మిడ్‌ మానేరు, గౌరెల్లి, తోటపల్లి పనుల్లో హరీశ్ వెయ్యి కోట్లు తీసుకున్నారు. తన బినామీలకే కాంట్రాక్ట్ లు ఇప్పించారు. ఆ డబ్బులనే కేసీఆర్ కు  తెలియకుండా ఎన్నికల్లో డబ్బులు పంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 26మందికి హరీశ్ డబ్బులిచ్చారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు ఇస్తానంటే తీసుకోలేదు. హరీష్.. అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడటం కేసీఆర్‌కు తెలిసింది. అందుకే మంత్రి పదవి కట్ చేశారు. ఒకవేళ హరీశ్‌ ఎదురు తిరిగితే పాస్‌పోర్టు కేసులో ఇరికించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిపై ఒక్క అవినీతి ఆరోపణ లేకపోయినా, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలేదని రేవంత్ విమర్శించారు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article