కాంగ్రెస్ పార్టీని బతికిద్దాం.. మునుగోడుకు రండి..

Revanth Reddy heart touching message to state congressmen, must see how many will turn to the munugode

రేవంత్ రెడ్డి పిలుపు

కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బీజేపీ, కేసీఆర్ లు కలిసి కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు కేసీఆర్ సుపారి తీసుకున్నాడని, పది రోజులపాటు ఢిల్లీలో ఉండి అమిత్ షా నరేంద్ర మోడీతో రహస్యమంతనాలు జరిపాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక అని పిసిసి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా అన్నాడు. కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టి ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు కేసీఆర్ కు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా నియంతల వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిసిసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడుకు రండి.. పార్టీని కాపాడుకుందాం.. దివిసీమల మన రాష్ట్రం కాకూడదని అభిప్రాయపడ్డారు. లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్య దక్షులు ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు మునుగోడుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారి కుట్ర జరుగుతుందని.. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ గమనించాలన్నారు. రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకే సొంత పార్టీ నాయకులు కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నారని.. తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదలి రావాలని.. పోరాడాలని.. స్రవంతికి అండగా నిలిచి గెలిపించాలని.. మునుగోడు మనకు అన్నం పెడుతుంది ఎవరు చింతించకండని పిలుపునిచ్చారు.

* పోలీసుల లాఠీల దెబ్బలకు ఎవరు భయపడొద్దు.. ప్రాణాలైనా ఇద్దాం కాంగ్రెస్ పార్టీని బతికిద్దాం.. లాటి తూటాలకైనా తుపాకి గుండ్లకైనా సిద్ధంగా ఉన్నా.. ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తా.. రెండు అధికార పార్టీలు డబ్బులతో కలుద్దామని చూస్తున్నారు.. ప్రజాస్వామ్యం చంపాలని ప్రయత్నిస్తున్నారు.. ప్రజలారా ఆలోచించండి.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టాలి.. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్న రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article