పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్న కేసీఆర్

REVANTH REDDY ATTACKED CM KCR AGAIN. HE SAID CM KCR FORGOT THE SACRIFICES OF YOUTH, DUE TO WHICH SEPARATE TELANGANA STATE FORMED.

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్‌

సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి ని మంటలో కలిపార‌ని రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. నాలుగు కోట్ల ప్రజల హక్కు లను కాల రాశారని మండ‌పడ్డారు. ఏడున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం లోని ఖాళీ లను భర్తీ చేయకుండా మోసం చేస్తున్నారని విమ‌ర్శించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దక్కకుండా.. ఫీజు రీయింబర్స్మెంట్ ను ఎత్తేశారని దుయ్య‌బ‌ట్టారు. చేప పిల్లలు, బర్రెలు, గొర్రెలు పెంచుకోవాలంటూ పేద పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని విమ‌ర్శించారు. ఇంకా, ఆయ‌న ఏమ‌న్నారో రేవంత్ రెడ్డి మాట‌ల్లోనే..

విద్య విషయంలో కాంగ్రెస్ హయాంలో స్కూల్, కాలేజీలను పెద్ద ఎత్తున నెలకొల్పింది. ప్రతీ పేద వాని బిడ్డకు ఉచితంగా విద్యను అందించాలని ఇందిరా గాంధీ చట్టం తీసుకొచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ లో చదువులకు దూరం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం 4 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వనపర్తి లో లావణ్య అనే దళిత బిడ్డ ఆత్మహత్య.. ప్రభుత్వం చేసిన హత్య. ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ ప్రకారం తెలంగాణ లో 1.92 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. తెలంగాణ వచ్చాక రిటైర్మెంట్ అయిన స్థానంలో కొలువులు భర్తీ చేయలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం లో ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి కి నివాళ్లర్పించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. వేలాది మంది పోలీసులతో.. ఎల్బీనగర్ లో మోహరించారు.

శ్రీకాంతాచారి ఏమైనా అంతర్జాతీయ తీవ్రవాదినా.. నివాళ్లు అర్పించడానికి అర్హత లేదా. కేసీఆర్, కేటీఆర్ లను మాత్రమే పొగడాలా. అమరుల త్యాగాలను .. చెరిపేయాలని కుట్ర చేస్తున్నారు. వందలాది మంది అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ లో వారి స్మరించుకోకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ లతో నిరంకుషంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేధావులు బయటకు రావాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచన చేయాలి. లక్షలాది మంది ఆకలి పోరాటానికి సిద్ధం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోయింది.. పోలీసు ఉక్కు పాదాల మధ్య నలిపేయాలని చూస్తున్నారు. ఉద్యోగ నియామకాలు లేకపోవడంతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వెయ్యి అడుగుల గోతి క‌డ‌తాం. లక్షలాది మంది విద్యార్థులతో పరేడ్ గ్రౌండ్లో కవాతు చేస్తాం. నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తొలి అడుగు అడ్డుకోవచ్చు.. మలి అడుగు పాలమూరు యూనివర్సిటీ లో పెడతాం. శాంతికి చిరునామా అయినా.. గాంధీ జయంతి కావడం తో మౌనం గా భరిస్తున్నాం. ఈ రోజు ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన తెలిపాం.కేసీఆర్ ను పొలిమేర్లు తరిమే వరకు పోరాటం చేస్తాం.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article