సోమవారం తెలంగాణ అసెంబ్లీలో పాత స్నేహితులైన రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీలు కలిశారు. లాబీలో ఈ ఇద్దరు ప్రత్యేకంగా భేటి అయ్యారు. తమ ఇద్దరం కలవడం వెనక ప్రత్యేక ఉద్దేశ్యం ఏమీ లేదని బయటికి చెబుతున్నప్పటికీ, రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్‌కి ఓ పెద్ద ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. టీఆర్ఎస్ చేస్తున్న పలు పథకాల ఫెయిల్యూర్ గురించి రేవంత్ చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా, కాళేశ్వరం వల్ల సాగుతున్న దోపిడి, కొవిడ్ వల్ల జరుగుతున్న నిర్లక్ష్యం గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి మొత్తానికి ఎంఐఎంను తమ వైపు తిప్పుకునేందుకు అసెంబ్లీ సమావేశాల్ని బాగానే వినియోగించుకుంటున్నారని సమాచారం. అదేవిధంగా పాత మిత్రులైన సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో మళ్లీ మైత్రిబంధం కొనసాగించేందుకు రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నారని తెలిసింది. ఏదీఏమైనా, కాంగ్రెస్ పార్టీకి గల సానుకూల అవకాశాల్ని ఏదీ రేవంత్ వదిలిపెట్టడం లేదు. గతంలో వైఎస్సార్ బతికి ఉన్న రోజుల్లో కాంగ్రెస్‌కు ఉన్న పూర్వ వైభవాన్ని మళ్లీ తెచ్చేందుకు తాజా పీసీసీ అధ్యక్షుడు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
రేవంత్ అక్బరుద్దీన్ కి ఏం ఆఫర్ ఇచ్చాడు?
