కేసీఆర్ చేతిలో బందీ

125
Revanth Reddy on CM KCR - YS Jagan
  • పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సబ్బండ వర్గాలు కేసీఆర్ చేతిలో బందీ అయ్యారు. సబ్బండ వర్గాల సమస్యల పై అనుబంధ విభాగాల అధ్యక్షులతో చర్చించా. మనకు నీళ్ళు సంస్కృతి… కానీ అవే నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం గా మారాయి.
పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా …ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్ధం..

రెండు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టీఏంసీల నీరు జగన్ ప్రభుత్వం తరలించబోతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజు కు 1 టీఎంసీ ల నీరు కు మించి తరలించలేరు. జూరాలలో మనకు కనిపించిన నీరు…సంగంబండ తర్వాత కనపించదు. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుంది.. దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్. కృష్ణా నది నుండి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు..
ఆ తర్వాత ప్రగతి భవన్ లో జగన్ కు కేసీఆర్ అథితి మర్యాదలు చేసారు.

ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ సమావేశం తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టనట్లే ఉంది. ఓక సామాన్య వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసువేస్తే…ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. కృష్ణా బేసిన్ నీళ్ళను పెన్నా బేసిన్ నీళ్ళను తరలిస్తుంటె…వాదనలలో పస లేని రాంచదర్ రావు ను లాయర్ గా పెట్టాడు.

ఎన్ జీ టీ లో సమర్దవంతమైన వాదనలు వినిపించకుండ పోవడం వల్ల ఇప్పుడు మనకు ప్రమాదం వచ్చింది. జగన్ కు కేసీఆర్ అమ్ముడు పోవడం వల్లే మనకు ఈ పరిస్థితి వచ్చింది. జులై 8 వైఎస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ కూతురు తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుంది. వైఎస్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారు. అంతే గాని తెలంగాణ లో ఏం చేసినా చెల్లుతుంది అంటే కుదరదు. ఎన్టీఆర్, వైఎస్ అంటే సంక్షేమం గుర్తుకు వస్తుంది. అలాంటి వారిని తిడితే కుష్ఠురోగం వస్తుంది. వైఎస్ కొడుకు ను ఇంటికి పిలిచి మర్యాద చేస్తరు…అలాంటి ను ఇప్పుడు ఏందుకు తిడుతున్నారు.
కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు, కేటీఆర్ ఆర్థిక ప్రయోజనం వల్లే మనకు ఈ గతీ. తెలంగాణ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు…ఎవరిని రెచ్చగొట్టడం కోసం..

తెలంగాణ లో ఉన్న ఆంధ్ర వాల్లకోసమే గట్టిగా మాట్లాడట్లేదంటుంన్న జగన్.. తన తండ్రి ని తిడితే నోరు మెదపని వాడు..ఏపీ కి ఏం న్యాయం చేస్తారు. వైఎస్ను తిడితే… అటు జగన్ , ఇటు విజయమ్మ ఓక్కరు కూడా నోరు మెదపలేదు. జగన్ ను కేసీఆర్ , షర్మిల ఏందుకు నిలదీస్తలేరు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు ..వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారు. జల వివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ ఇది. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు..

పార్లమెంట్ సమావేశాల్లో కృష్ణా నది జలాల పై టిఆర్ఎస్ విధానం ఏంటి? మా ఎంపీ లను ఓప్పించి నేను పోరాడుతా. వైఎస్ కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాడే..ఇది షర్మిల తెలుసుకోవాలి. ఏ సెంటిమెంట్ తో అయితే గద్దెనెక్కిండో కేసీఆర్ .. అదే సెంటిమెంట్ తో అందపాతాలానికి పోతడు.. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడే కేసీఆర్ ను గద్దె దించుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here