Revanth Reddy Patnam Gosa yatra
తెలంగాణా సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు .పట్నం గోస పేరుతో కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన రేవంత్ కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. సమగ్ర సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇల్లు లేవని తేల్చారన్నారు. ఎర్రవల్లి, చింతమడకకు ఇచ్చినట్టుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలి. హైదరాబాద్ ప్రజలను కేసీఆర్ మోసం చేసిన తీరును ఎండగడతాం. పట్నం గోస పేరుతో కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. కాంట్రాక్టర్లకు 900 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదు’ అని కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ మండిపడ్డారు.