మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి…

1440
Revanth Trying To Protest On KTR Farm House
Revanth Trying To Protest On KTR Farm House

Revanth Trying To Protest On KTR Farm House

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డిని  పోలీసులు అరెస్ట్‌  చెయ్యటం ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో తాజాగా  మంత్రి కేటీఆర్‌ గండిపేట చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ దానిని ముట్టడించడానికి రేవంత్‌ రెడ్డి ప్రయత్నించటం ఉద్రిక్తతలకు కారణం అయ్యింది . సమాచారం తెలుసుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద అరెస్ట్‌ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని, వారితో పాటు అనుచరులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టు సందర్భంగా జన్వాడ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
అరెస్టు సందర్భంగా రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ,  111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీ‍ఆర్‌లు చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌  తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఫామ్‌హౌస్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Trying To Protest On KTR Farm House,#ktrfarmhouse,revanth reddy, congress leader , gandipeta pond, farm house, illegal construction , janwada , ktr, cm kcr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here