ఉధృతంగా రెవెన్యూ ఉద్యోగుల పోరాటం

Revenue Employees Action Plan

తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తర్వాత రెవెన్యూ ఉద్యోగులు పోరుబాట పట్టారు . ఆ తర్వాత ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులపై రైతులు విరుచుకుపడుతున్నారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని  రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశారు. తహసిల్దార్ విజయ రెడ్డి సజీవదహనం నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఆరోపిస్తూ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నేత వి. లచ్చిరెడ్డి రెవెన్యూ ఉద్యోగుల కార్యచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈ నెల 13 న ఉద్యోగులంతా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ 14న ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పణ ఉంటుంది. ఇక 15 న అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో వంటా-వార్పు కార్యక్రమం నిర్వహిస్తారు. 16 న భూసంబంధిత విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. 16 నుండి 22 వరకు ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు.ఈ లోపు ప్రభుత్వం స్పందించి తమ విషయంలో నిర్ణయం తీసుకుంటే సరి… లేదంటే 30న ‘సింహగర్జన’ పేరుతో హైదరాబాద్‌లో రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. రెవెన్యూ ఉద్యోగులు భద్రత లేని వాతావరణంలో పని చెయ్యలేరని, దొంగలుగా ప్రభుత్వం ముద్ర వేసిన నేపధ్యంలోనే ఈ తరహా ఘటన జరిగిందని వారు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

tags : revenue employees, abdullapurmet, vijaya reddy, tahsildar, action plan, Telangana, telangana government, simha garjana

సినీ నటుడు రాజశేఖర్ కు మేజర్ యాక్సిడెంట్

అమెరికా వేదికగా కేసీఆర్ ని ఏకిపారేసిన రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *