ఆర్జీవీ వెర్స‌స్ జ‌న  సైనిక్స్

Spread the love

RGV vs Pawan Kalyan Fans

జ‌న‌సేనాని విష‌య‌మై ఎప్పుడూ వ‌ర్మ ఏదో ఒక‌టి అంటూనే ఉంటారు.. ఏమంటే అదొక స‌ర‌దా అంటారు.. ఎందుకంటే ఆయ‌న‌ను కానీ వేరొక‌రిని కానీ ఏమీ అనకుండా ఉండ‌నిదే నిద్ర ప‌ట్ట‌దు అంటారు.. తిట్లు వింటేనే హాయి నిద్ర ఒక‌టి త‌న‌ను క‌మ్ముకు వ‌స్తుంద‌ని లేకపోతే ఆ రోజు తన‌కు మ‌న‌శ్శాంతి అన్న‌దే ఉండ‌దు అని చెబుతారాయ‌న‌.. తాజాగా ఓ పోస్ట‌ర్ ను జ‌న సైనికులు ఆన్ లైన్ మాధ్య‌మాల్లో ఉంచారు.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి నాలుగు వ్యంగ్యాస్త్రాలు సంధించిన కార‌ణంగా ఈ ప‌ని వారు చేసి ఉంటార‌న్న‌ది ఓ ఊహ‌. ఇదెంత మాత్రం త‌గ‌దు అని, వ‌ర్మ‌కు రిప్ రాసినంత మాత్రాన క్రేజ్ వ‌స్తుందే త‌ప్ప ప్రాథ‌మిక స‌మ‌స్య‌లు అన్న‌వి ప‌రిష్కృతం కావ‌ని, జన‌సేన నిర్మాణం, వ్యాప్తి అన్న‌వాటిపైనే సంబంధిత వ‌ర్గాలు దృష్టి సారించాల‌ని వ‌ర్మ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

TOLLYWOOD UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *